ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

6జీలో నాయకుడిగా ఎదగాలి

ABN, First Publish Date - 2023-10-30T02:06:57+05:30

మలితరం టెలికాం సేవలైన 6జీలో భారత్‌ నాయకత్వ స్థాయికి ఎదగాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు....

టెలికాం సేవలు అందుబాటు ధరల్లో ఉండాలి: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

న్యూఢిల్లీ: మలితరం టెలికాం సేవలైన 6జీలో భారత్‌ నాయకత్వ స్థాయికి ఎదగాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ‘భారత్‌ 6జీ విజన్‌’ పేరుతో ప్రత్యేక ప్రామాణికాలను రూపొందించినట్టు తెలిపారు. ఈ ప్రత్యేక ప్రణాళికను అంతర్జాతీయ టెలికాం యూనియన్‌ (ఐటీయూ) కూడా ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌-2023 సదస్సుకు హాజరైన వైష్ణవ్‌ పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు. దేశీయంగా 6జీ టెక్నాలజీ అభివృద్ధి కోసం పరిశ్రమ వర్గాలు, విద్యా సంస్థలు, విద్యార్థులు, ప్రభుత్వం కలిసికట్టుగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. కాగా దేశంలో టెలికాం సేవల ధరలు ప్రపంచంలోని మిగతా ఏ దేశంతో పోల్చినా అందుబాటు ధరల్లోనే ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వైష్ణవ్‌ స్పష్టం చేశారు.

విదేశాలకూ విస్తరిస్తాం: రిలయన్స్‌ జియో

దేశ టెలికాం రంగంలో సత్తా చాటిన రిలయన్స్‌ జియో విదేశీ మార్కెట్లపైనా కన్నేసింది. ఇండియా మొబైల్‌ కాంగ్రె స్‌కు హాజరైన రిలయన్స్‌ జియో ప్రెసిడెంట్‌ మాథ్యూ ఊమెన్‌ ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం ఈ విషయాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. యూనివర్సల్‌ సర్వీసెస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎ్‌సఓఎఫ్‌) ద్వారా సమీకరించిన రూ.75,700 కోట్ల నిధు ల్లో కొంత భాగాన్ని టెలికాం ఉపకరణాల కొనుగోళ్లకూ బదలా యించాలని కోరారు.

Updated Date - 2023-10-30T02:06:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising