ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ather Energy: హైదరాబాద్‌లో రెండు ఎక్స్‌‌పీరియన్స్ కేంద్రాలను ప్రారంభించిన ఎథర్ ఎనర్జీ

ABN, First Publish Date - 2023-01-05T21:05:07+05:30

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఎథర్ ఎనర్జీ(Ather Energy) హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో రెండు నూతన ఎక్స్‌పీరియన్స్ కేంద్రాలను ప్రారంభించింది. ప్రైడ్‌ ఎలక్ట్రిక్‌ భాగస్వామ్యంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఎథర్ ఎనర్జీ(Ather Energy) హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో రెండు నూతన ఎక్స్‌పీరియన్స్ కేంద్రాలను ప్రారంభించింది. ప్రైడ్‌ ఎలక్ట్రిక్‌ భాగస్వామ్యంతో సికింద్రాబాద్‌లోని ఆర్‌పీ రోడ్‌ వద్ద ఒకటి, రామ్‌ గ్రూప్‌ సహకారంతో సోమాజీగూడ సర్కిల్‌ వద్ద అమిత్‌ ప్లాజా వద్ద మరోటి ప్రారంభించింది. మూడవ తరపు ఎథర్‌ యొక్క ప్రతిష్టాత్మకమైన స్కూటర్‌లో 450X, 450 Plus బైక్‌లను ఇక్కడ కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. టెస్టు రైడ్ కూడా చేసుకోవచ్చు.

ఈ రెండుఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాలు వినూత్నమైన యాజమాన్య అనుభవాలను అందిస్తాయి. విద్యుత్ వాహనాలపై వినియోగదారులకు అవగాహన కల్పించేలా వీటిని రూపొందించారు. ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని సందర్శించడానికి ముందే ఎథర్‌ ఎనర్జీ వెబ్‌సైట్‌ ద్వారా టెస్ట్‌ రైడ్‌ స్లాట్స్‌ను బుక్ చేసుకునే వీలుంది. ఈ సందర్భంగా ఎథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ సింగ్ ఫొకేలా(Ravneet S. Phokela) మాట్లాడుతూ.. నగరంలో తమ మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి తమ స్కూటర్లకు అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్‌ వాహనాలకు డిమాండ్‌ అసాధారణంగా పెరిగినట్టు చెప్పారు. స్ధిరత్వం, నాణ్యత, విశ్వసనీయత కోసం ఈవీల వైపు చూస్తున్నట్టు చెప్పారు. వీరు కోరుకునే అంశాలను ఎథర్‌ విస్తృత స్థాయిలో అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

ప్రైడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సురేశ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్‌ ద్విచక్రవాహనాలకు విప్లవాత్మక సాంకేతికతను తీసుకురావడంలో ఎథర్‌ ఎనర్జీ అగ్రగామిగా ఉందన్నారు. గత రెండేళ్లలో ఈ బ్రాండ్ పట్ల తమ నమ్మకం, విశ్వాసం మరింత పెరిగిందన్నారు. రామ్ గ్రూప్‌నకు చెందిన శివతేజ వర్మ మాట్లాడుతూ.. ఎథర్ ఎనర్జీతో చేయి కలిపినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ భాగస్వామ్యంతో విద్యుత్ స్కూటర్లను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

Updated Date - 2023-01-05T21:05:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising