ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భోగాపురం విమానాశ్రయానికి మరో రూ.675 కోట్లు

ABN, Publish Date - Dec 22 , 2023 | 04:38 AM

ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసి నిర్వహించనున్న జీఎంఆర్‌ విశాఖపట్నం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీవీఐఏఎల్‌)లో...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసి నిర్వహించనున్న జీఎంఆర్‌ విశాఖపట్నం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీవీఐఏఎల్‌)లో నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌) రూ.675 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనుబంధ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ (జీఏఎల్‌), ఎన్‌ఐఐఎఫ్‌ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2022, డిసెంబరులో జీఎంఆర్‌, ఎన్‌ఐఐఎ్‌ఫల మధ్య ఫైనాన్షియల్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌కు చెందిన మూడు ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్టుల్లో ఎన్‌ఐఐఎఫ్‌ పెట్టుబడులు పెడుతుంది. ఈ ఒప్పందానికి అనుగుణంగా తాజాగా భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టులో ఎన్‌ఐఐఎఫ్‌ పెట్టుబడులు పెడుతోందని జీఎంఆర్‌ వెల్లడించింది. ఇప్పటికే జీఎంఆర్‌ గోవా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌లో ఎన్‌ఐఐఎఫ్‌ పెట్టుబడులు పెట్టింది.

Updated Date - Dec 22 , 2023 | 04:38 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising