ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lay Off: అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్...18వేల మంది ఉద్యోగుల తొలగింపు

ABN, First Publish Date - 2023-01-05T09:45:11+05:30

గ్లోబల్ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ మళ్లీ గురువారం లేఆఫ్ ప్రకటించింది....

Amazon Lay Off
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ (అమెరికా): గ్లోబల్ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ మళ్లీ గురువారం లేఆఫ్ ప్రకటించింది.(Lay Off) ఆర్థిక సంక్షోభం వల్ల మరోసారి 18వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్(Amazon) సీఈఓ ఆండీ జస్సీ(CEO Andy Jassy) వెల్లడించారు. ఈ మేరకు అమెజాన్ ఉద్యోగులకు ఒక సందేశాన్ని పంపించారు.అమెజాన్ గత ఏడాది నవంబర్ నెలలో 10వేలమంది ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక సంక్షోభం(uncertain economy), కరోనా మహమ్మారి వల్ల 18వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని ఆండీ జస్సీ చెప్పారు.

ఈ ఉద్యోగుల తొలగింపుల వల్ల ఉద్యోగులకు కష్టమని తెలిసినా నిర్ణయం తీసుకోక తప్పడం లేదని సీఈఓ చెప్పారు. ఉద్యోగుల తొలగింపు యూరప్ దేశాల్లో ఉంటుందని జనవరి 18వతేదీ నుంచి తొలగించే ఉద్యోగులకు సమాచారం అందిస్తామని జస్సీ తెలిపారు. మా సంస్థలో ఓ సహచరుడు లే ఆఫ్ సమాచారాన్ని లీక్ చేయడంతో తాము ఈ ప్రకటన చేస్తున్నామని జస్సీ పేర్కొన్నారు.గత ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కంపెనీలో 1.54 మిలియన్ల మంది ఉద్యోగులున్నారు.

Updated Date - 2023-01-05T09:46:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising