ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఐఏఎన్‌ఎ్‌సలో అదానీకి 50% వాటా

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:14 AM

భారత్‌లో రెండో అత్యంత ధనికుడైన గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌.. ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ ఐఏఎన్‌ఎ్‌స ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మెజారిటీ వాటా (50.50 శాతం)ను చేజిక్కించుకుంది...

మీడియా రంగంలో గ్రూప్‌నకు ఇది మూడో కొనుగోలు

న్యూఢిల్లీ: భారత్‌లో రెండో అత్యంత ధనికుడైన గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌.. ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ ఐఏఎన్‌ఎ్‌స ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మెజారిటీ వాటా (50.50 శాతం)ను చేజిక్కించుకుంది. ఒప్పందం విలువను మాత్రం వెల్లడించలేదు. అదానీ మీడియా రంగంలో మరింత విస్తరించేందుకు ఈ డీల్‌ దోహదపడనుంది. గ్రూప్‌ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌.. తన మీడియా అనుబంధ విభాగమైన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌ (ఏఎంఎన్‌ఎల్‌) ద్వారా ఈ డీల్‌ కుదుర్చుకున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. మీడియా రంగంలో అదానీకిది మూడో కొనుగోలు. వ్యాపార, ఆర్థిక సంబంధిత వార్తల డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ బీక్యూ ప్రైమ్‌ నిర్వహణ సంస్థ క్వింటిల్లియన్‌ బిజినెస్‌ మీడియాలో మెజారిటీ వాటా కొనుగోలు ద్వారా అదానీ గ్రూప్‌ గత ఏడాది మార్చిలో మీడియా రంగంలోకి ప్రవేశించింది. 2022 డిసెంబరులో ఎన్‌డీటీవీ న్యూస్‌ నెట్‌వర్క్‌లో 65 శాతం వాటా దక్కించుకుంది. ఈ రెండింటిని కూడా ఏఎంఎన్‌ఎల్‌ ద్వారానే టేకోవర్‌ చేసింది. ఇటీవలే బీక్యూ ప్రైమ్‌ను ఎన్‌డీటీవీ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో విలీనం చేసింది. ఐఏఎన్‌ఎ్‌స, దాని వాటాదారు సందీప్‌ బాజ్మీతో ఏఎంఎన్‌ఎల్‌ షేర్‌హోల్డర్‌ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుందని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. ఇకపై ఐఏఎన్‌ఎల్‌ వ్యాపార కార్యకలాపాలు, యాజమాన్య నియంత్రణతో పాటు సంస్థలో డైరెక్టర్ల నియామక హక్కులు సైతం ఏఎంఎన్‌ఎల్‌ చేతుల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఇకపై ఐఏఎన్‌ఎ్‌స.. ఏఎంఎన్‌ఎల్‌కు అనుబంధ విభాగంగా కొనసాగనుందని తన ప్రకటనలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఐఏఎన్‌ఎ్‌స ఆదాయం రూ.11.86 కోట్లుగా నమోదైంది.

Updated Date - Dec 17 , 2023 | 01:14 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising