వయాట్రిస్, ఫైజర్ బ్రాండ్ల కొనుగోలు పూర్తి
ABN, Publish Date - Dec 17 , 2023 | 01:07 AM
వయాట్రిస్, ఫైజర్ బ్రాండ్లకు చెందిన మార్కెటింగ్, తయారీ హక్కులను సొంతం చేసుకునే ప్రక్రియ పూర్తయినట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది...
అరబిందో ఫార్మా
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వయాట్రిస్, ఫైజర్ బ్రాండ్లకు చెందిన మార్కెటింగ్, తయారీ హక్కులను సొంతం చేసుకునే ప్రక్రియ పూర్తయినట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. దాదాపు రూ.398 కోట్లతో వయాట్రిస్, ఫైజర్‌కు చెందిన 15 ఫార్ములేషన్ల బాండ్లను కొనుగోలు చేస్తున్నట్లు కొద్ది నెలల క్రితం అరబిందో ఫార్మా ప్రకటించింది. ఈ బ్రాండ్ల ద్వారా అరబిందో ఇండోనేషియా మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఇండోనేషియా ఫార్మా మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతున్నందున ఈ మార్కెట్లోకి అడుగుపెడుతున్నామని.. కంపెనీ సొంతం చేసుకున్న బ్రాండ్ల విక్రయాలు 2022లో 3.05 కోట్ల డాలర్ల మేరకు ఉన్నట్లు అరబిందో వెల్లడించింది.
Updated Date - Dec 17 , 2023 | 01:07 AM