రేపటి నుంచి సమ్మె
ABN, Publish Date - Dec 19 , 2023 | 12:05 AM
డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20న సమ్మెలోని వెళుతున్నామని ఏపీ సర్వశిక్ష అభియాన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన జేఏసీ నాయకులు తెలిపారు.
నోటీసు ఇచ్చిన సమగ్రశిక్ష ఉద్యోగుల జేఏసీ
అనంతపురం విద్య, డిసెంబరు 18: డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20న సమ్మెలోని వెళుతున్నామని ఏపీ సర్వశిక్ష అభియాన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మె నోటీసు ఇవ్వడానికి సోమవారం డీఈఓ కార్యాలయానికి వెళ్లారు. డీఈఓ లేకపోవడంతో సూపరింటెండెంట్ ఆదినారాయణకు, సమగ్రశిక్షలో ఏపీసీ లేకపోవడం ఏఎంఓ చంద్రశేఖర్‌కు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు, అకౌంటెంట్లు, సీఆర్పీలు ఇతర నాయకులు మాట్లాడుతూ, ఎమ్మార్సీ సిబ్బంది సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఎంటీఎస్‌పై జీవోలు ఇచ్చి, మూడేళ్లుగా అమలు చేయడంలేదని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఆర్పీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఈఆర్పీలు, సీఆర్టీలు, కంప్యూటర్లు, ఇతర కేజీబీవీ ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ నెల 20వ తేదీ నుంచి సమ్మెలోకి వెళతామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు విష్ణు, నవీన, రామమోహన, వినయ్, రామాంజి, శంకర్, రాము, దాదా, రాజారెడ్డి, ఓబులేసు, అశ్వత్థ, ఆది, పుణ్యవతి, రామాంజినమ్మ పాల్గొన్నారు.
Updated Date - Dec 19 , 2023 | 12:05 AM