సోలార్..అడవి పందులు పరార్..!
ABN, First Publish Date - 2023-12-03T23:01:18+05:30
ఎక్కడి నుంచి వస్తున్నాయో.. ఏ వైపు నుంచి వస్తున్నాయో కానీ గుంపులుగుంపులుగా వస్తున్న అడవి పందులు పంట పొలాల్లోకి చొ రబడి పైర్లను ధ్వంసం చేసి నాశనం చేస్తున్నాయి. రైతులు మతాబులు పేల్చినా, డబ్బాలతో శబ్దం చేసినా పై ర్లలో నుంచి బయటకు కూడా రావడంలేదు. దీంతో అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు రై తులు వినూత్నంగా సోలార్‌ను అమరుస్తున్నారు.
పంటలను ధ్వంసం చేస్తున్న వైనం
వాటి బారి రక్షణకు రైతుల వినూత్న ప్రయోగం
పీసీపల్లి, డిసెంబరు 3 : ఎక్కడి నుంచి వస్తున్నాయో.. ఏ వైపు నుంచి వస్తున్నాయో కానీ గుంపులుగుంపులుగా వస్తున్న అడవి పందులు పంట పొలాల్లోకి చొ రబడి పైర్లను ధ్వంసం చేసి నాశనం చేస్తున్నాయి. రైతులు మతాబులు పేల్చినా, డబ్బాలతో శబ్దం చేసినా పై ర్లలో నుంచి బయటకు కూడా రావడంలేదు. దీంతో అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు రై తులు వినూత్నంగా సోలార్‌ను అమరుస్తున్నారు. మండలంలోని పీసీపల్లి, పెద్దన్నపల్లి, తలకొండపాడు, వేపగుంపల్లి, కమ్మవారిపల్లి, గుంటుపల్లి, శంకరాపురం, లక్ష్మక్కప ల్లి, పెదయిర్లపాడు, నేరేడుపల్లి, మురుగుమ్మి తదితర గ్రామాల్లో ఈ ఏడాది మినుము, మిరప పంటలను ఎ క్కువగా సాగుచేశారు. మరికొన్ని గ్రామాల్లో వరి సాగుచేశారు. అయితే ఆయా గ్రామాలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో రాత్రిపగలు అని తేడా లేకుండా అడవిపందులు పొలాల్లోకి వచ్చి పైర్లను విరగ్గొట్టి నాశనం చేస్తున్నాయి.రైతులు వివిద ర కాలుగా శబ్దాలు చేసినా అవి పైరులో నుంచి బయటకు పోవడంలేదు. దీంతో రైతులు వినూత్నంగా పొలం చు ట్టూ తీగలు చుట్టి సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటుచేసి దాని నుంచి తీగలకు కనెక్షన్ ఇచ్చారు. తీగలకు విద్యుత్ ప్రవహించేందుకు సోలార్ ప్యానెల్ నుంచి బ్యాటరీకి కనెక్షన్ ఇస్తారు. బ్యాటరీ నుంచి పొలం చుట్టూ ఉన్న తీగలకు క నెక్షన్ ఇవ్వడంతో తీగలమొత్తానికి విద్యుత్ ప్రవహిస్తుం ది. అడవిపందులు పొలంలోకి వస్తున్న సమయంలో చు ట్టూ ఉన్న తీగల నుంచి షాక్ తగలడంతో అడవి పం దులు పొలంలోకి ప్రవేశించకుండా దూరంగా వెళ్లిపోతున్నాయి. విద్యుత్‌షాక్‌తో అడవిపందుల ప్రాణాలకు మా త్రం ఎటువంటి ప్రమాదం ఉండడంలేదు. షాక్‌కు గు రైన పందులు మరోసారి ఆ పొలం వైపు రావడంలేదు. సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు పంటల సాగుకోసం అదనంగా 10వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. సోలార్‌ప్యానెల్ ఏర్పాటుతో ఉపయోగం ఉండడంతో ప్రతి గ్రా మంలోను రైతులు ఒకరిని చూసి మరొకరు పంటల రక్షణకోసం సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విధంగా అడవి పందుల బారి నుంచి పంటలను రక్షించుకుంటున్నామని రైతులు చెప్తున్నారు.
Updated Date - 2023-12-03T23:01:20+05:30 IST