కాకుటూరివారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు నవనీతమ్మ మృతి
ABN, First Publish Date - 2023-11-21T23:19:43+05:30
టంగుటూరు మండలంలోని కాకుటూరివారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు తొట్టెంపూడి నవనీతమ్మ (65) మంగళవారం మృతి చెందారు.
కాకుటూరివారిపాలెం (టంగుటూరు), నవంబరు 21 : మండలంలోని కాకుటూరివారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు తొట్టెంపూడి నవనీతమ్మ (65) మంగళవారం మృతి చెందారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖపట్నంలోని కుమార్తె వద్ద ఉంటూ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆమెను కుటుంబ సభ్యులు నాలుగురోజులు క్రితం విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్ను మూశారు. నవనీతమ్మ మృతదేహాన్ని బుధవారం ఉదయానికి కాకుటూరివారిపాలెంలోని స్వగృహానికి తీసుకురానున్నారు. ఆమె మృతికి మండలంలోని సహచర ఎంపీటీసీ సభ్యులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది సంతాపం తెలిపారు.
Updated Date - 2023-11-21T23:20:15+05:30 IST