ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రచారం కోసం వైసీపీ పరిశీలన పాట్లు..!

ABN, Publish Date - Dec 17 , 2023 | 05:21 AM

వైసీపీ బస్సుయాత్రలు తుస్సుమన్నాయి. ‘గడప గడప’లో నిలదీతలే ఎదురయ్యాయి. దీంతో వైసీపీ నేతలు రూటు మార్చినట్టున్నారు! అభివృద్ధి చేస్తున్నాం అని చూపించేందుకు..

వైసీపీ బస్సుయాత్రలు తుస్సుమన్నాయి. ‘గడప గడప’లో నిలదీతలే ఎదురయ్యాయి. దీంతో వైసీపీ నేతలు రూటు మార్చినట్టున్నారు! అభివృద్ధి చేస్తున్నాం అని చూపించేందుకు.. మంత్రులు, ఎమ్మెల్యేలు తాము ప్రారంభించిన కార్యక్రమాల పరిశీలనకు వెళ్తున్నారు. తాజాగా విజయనగరంలోని భోగాపురం విమానాశ్రయ ప్రాంతాన్ని మంత్రుల బృందం పరిశీలించింది. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఐటీ మంత్రి అమర్‌నాథ్‌తోపాటు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రస్తుతం ఇక్కడ మట్టి పనులు, ప్రహరీ నిర్మాణం పనులే జరుగుతున్నాయి. దీనికే పనుల పరిశీలన పేరుతో హడావుడి చేస్తూ అనుకూల ప్రచారం చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. సీఎం జగన్‌ విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన తర్వాత ఒక్క అడుగైనా ముందుకు పడలేదు. వైద్య కళాశాలను ప్రారంభించినా అనుబంధ భవన సముదాయాలు ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయి.

- (విజయనగరం-ఆంధ్రజ్యోతి)

Updated Date - Dec 17 , 2023 | 05:21 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising