ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీకి పాడె కట్టేందుకు యువత సిద్ధం!

ABN, First Publish Date - 2023-12-11T02:33:20+05:30

చంద్రబాబుగానీ, టీడీపీగానీ తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదన్నది సుస్పష్టమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ జోక్యం లేదు: బుద్దా వెంకన్న

విజయవాడ(వన్‌టౌన్‌), డిసెంబరు 10: చంద్రబాబుగానీ, టీడీపీగానీ తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదన్నది సుస్పష్టమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న తేల్చిచెప్పారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఆడుదాం ఆంధ్రా పేరిట వైసీపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందన్నారు. యువకులంతా వైసీపీకి పాడె క ట్టడానికి ఎదురుచూస్తున్నార ని చెప్పారు. మూడేళ్ల కిత్రమే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మూడు ముక్కలాట, కేసినో, అశ్లీల డ్యాన్సులతో ‘ఆడుదాం ఆంరఽధా’ను ప్రారంభించారని, ఇప్పుడు కొత్తగా పెట్టేదేముందని ఎద్దేవా చేశారు. కొడాలి నాని పిచ్చి కుక్క అని, టీడీపీ అతనిని సస్పెండ్‌ చేస్తే వైసీపీలోకి వెళ్లాడని తెలిపారు. హైద రాబాద్‌ గాంధీభవన్‌ వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్న సమయంలో అక్కడ టీడీపీ జండాలు కనిపిస్తేచంద్రబాబుకు ఏం సంబంధమని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఎవరైనా చంద్రబాబును విమర్శిస్తే, ప్రతిగా తాము జగన్‌ను విమర్శిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ పిచ్చికుక్కలను అదుపులో ఉంచాల్సిన బాధ్యత సీఎందేనని తేల్చిచెప్పారు. వైసీపీ నేతలు పిచ్చివాగుడు మానాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కాగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బుద్దా వెంకన్న తెలిపారు. తనకు ఆ సీటు ఇస్తారన్న నమ్మకం ఉందన్నారు. తనకు ఆ సీటు ఇవ్వకపోతే ప్లాన్‌ బీ ఉందని పేర్కొన్నారు.

Updated Date - 2023-12-11T02:33:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising