ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యోగేశ్‌ గుప్తా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ABN, Publish Date - Dec 17 , 2023 | 05:17 AM

టిడ్కో’ నిధులు మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో తనను అరెస్టు చేసే అవకాశముందని ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ కేసులో నిందితుడు యోగేశ్‌ గుప్తా దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

పత్రికల కథనాల ఆధారంగా ఆందోళన సరికాదన్న హైకోర్టు

అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘టిడ్కో’ నిధులు మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో తనను అరెస్టు చేసే అవకాశముందని ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ కేసులో నిందితుడు యోగేశ్‌ గుప్తా దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. టిడ్కో నిధుల దుర్వినియోగంపై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని సీఐడీ అధికారులు చెబుతున్నారని న్యాయస్థానం తెలిపింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ముందుస్తు బెయిల్‌ కోరడంపై అభ్యంతరం తెలిపింది. మందస్తు బెయిల్‌ మంజూరుకు సహేతుక కారణాలు ఉండాలని చట్టనిబంధనలు చెబుతున్నాయని పేర్కొంది. టిడ్కో ఇళ్లకు సంబంధించిన నిధుల కుంభకోణం ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు చేసినట్లు పిటిషనర్‌ ఎలాంటి ఆధారాలూ చూపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. యోగేశ్‌ గుప్తా ఆందోళనకు సహేతుకమైన కారణాలు లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి. మల్లికార్జునరావు తీర్పు ఇచ్చారు.

Updated Date - Dec 17 , 2023 | 05:17 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising