ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వలంటీర్లపై వైసీపీ ఉక్కుపాదం

ABN, Publish Date - Dec 31 , 2023 | 03:51 AM

వలంటీర్ల వ్యవస్థపై వైసీపీ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. రూ.10వేలు జీతం పెంచుతానని గతంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలని, తమనూ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని అడిగిన పాపానికి వారిని ఏకంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు.

ధవళేశ్వరంలో 35మంది తొలగింపు?

రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి)/రాజమహేంద్రవరం రూరల్‌, డిసెంబరు 30: వలంటీర్ల వ్యవస్థపై వైసీపీ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. రూ.10వేలు జీతం పెంచుతానని గతంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలని, తమనూ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని అడిగిన పాపానికి వారిని ఏకంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. ఈ నెల 29న నుంచి సమ్మె నోటీసులు ఇవ్వడానికి సిద్ధపడటంతో మొదట బుజ్జగించారు. అయినా సమ్మెకే కట్టుబడినవారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం ధవళేశ్వరంలో 23మందిని, శాటిలైట్‌ సిటీ గ్రామంలో ఆరుగురిని, హుక్కంపేటలో ముగ్గురిని, కాతేరులో ముగ్గురిని తొలగించినట్టు తెలిసింది. అయితే ఎమ్మెల్యే సీటు ఖరారు కాలేదనే కోపంతో వైసీపీ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ వీరిని పట్టించుకోకవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వేటుపడిన వారిలో కొందరు వలంటీర్లు వైసీపీ నేతల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. అయితే అది పార్టీ అధిష్ఠానం నిర్ణయమని, తమవల్ల ఏమీ కాదని నేతలు చేతులెత్తేశారు. మరోవైపు, జనంతో వీరికి సంబంధాలు ఉన్నాయని, అందరినీ వెంటనే తొలగిస్తే పింఛన్ల పంపిణీ సమస్య అవుతుందని చెబుతూ చాలాచోట్ల వలంటీర్ల తొలగింపును కొందరు ఎమ్మెల్యేలు ఆపుతున్నారు.

Updated Date - Dec 31 , 2023 | 03:51 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising