ఎంపీ అభ్యర్థులు కావలెను
ABN, Publish Date - Dec 23 , 2023 | 12:37 AM
రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం వైసీపీ తంటాలు పడుతోంది. ఓ వైపు టీడీపీ – జనసేన పార్టీల ఉమ్మడి పొత్తు దరిమిలా ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
కొత్త ముఖాల కోసం వైసీసీ జల్లెడ
ఇప్పటికే ఎంపీ రఘురామ పార్టీకి దూరం
పోటీకి విముఖత చూపి ఎంపీ కోటగిరి
ఏలూరు బీసీ, నరసాపురానికి క్షత్రియ అభ్యర్థులు
ఏలూరు నుంచి అనిల్, కారుమూరి, నాగసత్యం !
నరసాపురం నుంచి ముదునూరు, రంగరాజు పేర్ల పరిశీలన
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం వైసీపీ తంటాలు పడుతోంది. ఓ వైపు టీడీపీ – జనసేన పార్టీల ఉమ్మడి పొత్తు దరిమిలా ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పైకి మేకపోతు గాంభీర్యం కనబరుస్తున్నా లోలోన వైసీపీకి ఏదో శంక పీడిస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో అనేక మందిని మార్చి, ఇంకొందరిని వేరేచోటికి బదిలీ చేసి, మరికొందరికి ఎంపీ టిక్కెట్ల ఆశ చూపింది. అయితే తొలిసారిగా వైసీపీలో ఎంపీలుగా పోటీ చేసేందుకు అభ్యర్థుల కొరత ఏర్పడింది. వీరి కోసం ఇప్పుడు అన్వేషణ సాగిస్తోంది.
రాజకీయాల్లో ఎంపీ స్థానంలో పోటీ చేయాలనుకునే వారికి సమాజంలో ఒక పరపతి, కుటుంబ నేపథ్యం, ఆర్థిక బలోపేతం లేదా సామాజికపరంగా వున్న స్థానం ఇవన్నీ కలిసొచ్చేవి. ఒకవేళ ఎమ్మెల్యే స్థానంలో వున్నా సదరు ఎమ్మెల్యేను ఆ స్థానం నుంచి మార్చి ఎంపీ టికెటు ఇచ్చి మరీ పోటీకి దింపేవారు. కానీ రానురాను సీను తిరగబడుతూ వచ్చింది. ఎంపీగా పోటీ చేయాలనుకుంటే సామాజిక బలమే కాదు, ఆర్థిక బలం ఉండాల్సిందే. ఈ స్థానానికి పోటీ చేసే వ్యక్తులు కాస్తంత దీటుగా నిలబడే సామర్థ్యం వున్నవారే కావాలనుకునే వారు. వైసీపీ ఏపీలో కాలిడిన తర్వాత ఎమ్మెల్యే బరి కాస్తంతా పవర్ ఫుల్‌గా అందరూ అంచనా వేస్తూ వచ్చారు. ప్రతిపక్షంలో వుండగా ఆ పార్టీలో వున్న అత్యధికులు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే ఉత్సాహ పడేవారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే స్థానంలో వున్న డొల్లతనం బయటపడింది. దాదాపు గెలిచిన వారంతా వైసీపీ ఆట బొమ్మలుగా మారారనే విమర్శలు న్నాయి. పోని ఎంపీగా గెలుపొందిన వారంతా ఇమేజ్‌ను కూడబెట్టుకున్నారంటే అదీ లేదు. ఈ నాలుగున్నరేళ్ల జగన్ పాలనానుభావాన్ని బేరీజు వేసుకున్న సీనియర్లు, జూనియర్లు వీలైతే ఎమ్మెల్యే గిరికి లేదంటే ఇంటికే పరిమితమే గాని పార్లమెంటు స్థానం వైపు తొంగి చూసే పరిస్థితి లేకపోయింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ 13 అసెంబ్లీ స్థానాలను, రెండు ఎంపీ స్థానాలను దక్కించు కుంది. నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలుపొందిన రఘు రామకృష్ణంరాజు చాలా కాలంగా ఆ పార్టీ వ్యవహార శైలిపై గుర్రుగా వున్నారు. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు. అంతకు ముందు రఘురామను టార్గెట్ చేసి నియోజకవర్గాల వారీగా ఆయనపై కేసులు పెట్టడానికీ వెనుకాడలేదు. వైసీపీ చేష్టలపై ఆయన లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రజల్లో వ్యక్తిగత ఇమేజ్ సాధించగా మరోవైపు వైసీపీ కార్యకలాపాలకు దూరంగా మిగిలారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వచ్చే ఎన్నికల్లో ఎంపీ పదవికి తానిక పోటీ చేయబోనని ప్రక టించారు. ఈ నిర్ణయా న్ని వాయిదా వేసుకోవా లని కోటగిరిని పార్టీ పెద్దలెవరూ ఒప్పించే ప్రయత్నం చేయలేదు. తొలివిడత ఎంపీగా కోటగిరి తన పని తాను చేసుకుంటూ పోయారు. కొన్నిసార్లు ఆటంకాలు ఏర్పడినా సంయమనం కోల్పోలేదు. చింతలపూడి వ్యవహా రాలు తప్ప మిగతా నియోజకవర్గాల్లో ఆయన పేరు సమస్యాత్మకంగా ప్రవస్తాన లేదు. వైసీసీ నాయకత్వం అటు నరసాపురం, ఏలూరు లోక్‌సభ స్థానాలకు పోటీ నిలబడే అభ్యర్థుల కోసం అన్వేషణకు దిగింది.
మాజీ మంత్రులను బుజ్జగిస్తారా.. ?
ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలేవో వెల్లడించిన తర్వాత ఆయా స్థానాల్లో ఎవరిని పోటీకి దింపాలనే అభిప్రాయంపై వైసీపీ అన్వేషణకు దిగింది. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వారి స్థానం లో కొత్త మొహాలను రంగంలోకి దింపుతున్నట్లే.. ఎంపీ స్థానాల్లో ఇదే చేయబోతున్నారు. వైసీపీ ఈసారి సరికొత్త వ్యూహానికి దిగబోతోంది. ఏలూరు నుంచి ఈసారి బీసీ అభ్యర్థులను ఎంపిక చేసి పోటీకి దింపా లని యోచిస్తోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఇరిగేషన్ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్‌కుమార్ యాదవ్‌ను రంగంలోకి దింపితే ఎలా ఉంటుంది, ఏ ఏ నియోజక వర్గాల్లో ఆయన దూకుడుగా వెళితే అనుకూలత ఉంటుంది ? లేకుంటే టీడీపీ సైతం బీసీ అభ్యర్థిని, ఈ నియోజకవర్గం పరిధిలోని వ్యక్తికే అవకాశం ఇస్తే దీనిని అనిల్ ఎలా అధిగమించగల రు ? అనే అంశంలపై తర్జనభర్జన జరుగుతోంది. యాదవు ల్లో పట్టున్న పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు పేరునూ ప్రతిపాదిస్తున్నారు. కాని ఆయన తణుకు నుంచే తిరిగి పోటీ చేయాలని ఉత్సాహ పడుతున్నారు. తన కుమారుడిని ఏలూరు ఎంపీగా పోటీకి ప్రతిపాదిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీసీయేతరులకు ఇవ్వాల్సి వస్తే కాపు సామాజిక వర్గం నుంచి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని పేరు ప్రతిపాదనకు వచ్చింది. గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ పేరు పార్టీలో నానింది. టీటీడీ బోర్డు సభ్యుడు నెర్సు నాగసత్యం పేరును వైసీపీ పెద్దలు కొందరు ప్రతిపాదిస్తూ ఆయనతో సంప్ర దించారు. ఆయన చాలా కాలంగా ఢిల్లీలోని అన్ని పార్టీల ముఖ్య నేతలతో టచ్‌లో ఉండేవారు. ఆయన మేఘా కంపెనీలో పనిచేసిన సందర్భం లోనే పార్టీ ముఖ్యులు, వివి ధ రంగాల్లో పట్టున్న వారి తో పరిచయాలు ఏర్పడ డంతో టీటీడీ బోర్డు పద వి ఆయనను వరించిం ది. ఆయనతో చర్చలు పూర్తయినట్టు సమాచారం.
నరసాపురం నుంచి రఘరామకృష్ణంరాజు స్థానంలో ఎవరిని పోటీకి దించాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజును అక్కడి నుంచి ఖాళీ చేయించి పాలకొల్లుకు బదిలీ చేస్తా రని ప్రచారం సాగింది. మరోవైపు నరసాపురం లోక్‌సభ నుం చి బరిలోకి నిలబడితే ఎలా ఉంటుందనేది చర్చిస్తున్నట్టు సమా చారం. ఈ స్థానం నుంచి క్షత్రియులకు కేటాయిస్తే ప్రసాదరాజు పేరుతోపాటు మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే రంగనాథరాజు పేరు, ఇంతకు మునుపు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన గోకరాజు రంగరాజు(పెదబుజ్జి) పేరు నానుతున్నాయి. వీరు ముగ్గురు పోటీకి విముఖత ప్రదర్శిస్తే కొత్త మొహాన్ని రంగంలోకి దింపేందుకు కొందరు బిగ్‌షాట్‌లతో పార్టీ సంప్రదిస్తున్నటు సమాచారం.
Updated Date - Dec 23 , 2023 | 12:37 AM