ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డు ప్రమాదంలో ముఠా కార్మికుడి మృతి

ABN, Publish Date - Dec 31 , 2023 | 01:11 AM

నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద రెండు లారీలు ఢీకొని ముఠా కార్మికుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసు కుంది.

నూజివీడు టౌన్‌, డిసెంబరు 30: నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద రెండు లారీలు ఢీకొని ముఠా కార్మికుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసు కుంది. హనుమాన్‌ జంక్షన్‌ నుంచి నూజివీడు వైపు వస్తున్న పీడీఎస్‌ లారీ, నూజివీడు వైపు నుంచి వస్తున్న మరో లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో పీడీఎస్‌ లారీలో బియ్యం దిగుమతికి వెళుతున్న ముఠా కార్మికుడు రోశయ్య (45) తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పీడీఎస్‌ బియ్యం అన్‌లోడ్‌ నిమిత్తం మొత్తం నలుగురు ముఠా కార్మికులు లారీలో వెళుతున్నారు. అలాగే ఈ ఘటనలో లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు గాయ పడ్డారని వారిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నూజివీడు రూరల్‌ ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. మృతుడు రోశయ్యది సుంకొల్లు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 01:11 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising