ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తిరస్కరించిన దరఖాస్తులు 2,366

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:20 AM

జిల్లాలోని ఏడు అసెంబ్లీల నుంచి ఓటర్ల ముసాయిదా జాబితాపై స్వీకరించిన అభ్యం తరాల సంఖ్య ఒక కొలిక్కి వచ్చింది.

పార్టీ నాయకులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంతి

భీమవరం, డిసెంబరు 16 : జిల్లాలోని ఏడు అసెంబ్లీల నుంచి ఓటర్ల ముసాయిదా జాబితాపై స్వీకరించిన అభ్యం తరాల సంఖ్య ఒక కొలిక్కి వచ్చింది. శనివారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పక్షాల నాయకులతో కలెక్టర్‌ ప్రశాంతి నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్ల డించారు. ముసాయిదా ఓట్ల జాబితాపై ఈనెల తొమ్మిదో తేదీన రెండు రోజులు పాటు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, అంతకు ముందు నిర్వహించిన అభ్యం తరాల స్వీకరణతో కలిపి ఈనెల 14వతేదీ వరకు మొత్తం మీద 90,897 ఓటర్ల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఫారం–6 ద్వారా 31,720 మంది నుంచి స్వీకరించగా 1261 దరఖాస్తులను తిరస్కరించారు. ఫారం–7 ద్వారా 35,666 దరఖాస్తులు అందితే 540 తిరస్కరించారు. ఫారం–8తో 46,865 దరఖాస్తులు అందగా 565 తిరస్కరించారు. మొత్తం మీద 90,897 ఓటర్ల నుంచి అభ్యంతరాలు రాగా ప్రస్తుతానికి 88,531 అభ్యంతరాలను అధికారికంగా స్వీక రించారు.తిరస్కరించిన 2366 దరఖాస్తులను ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచారు. గత అక్టోబరు నెల చివరి వారంలో ప్రకటించినజాబితాలో అప్పటివరకు పరిశీలించి తొలగింపు జాబితాలో 93,479 ఓట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితా నుంచి మొత్తం మీద 90,897 ఓటర్ల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో పెం డింగ్లో ఉంచిన ఓటర్ల సంఖ్య మినహాయిస్తే 88,531 ఓట్లను సరి చేసినట్లు ప్రస్తుతానికి భావించవచ్చు

Updated Date - Dec 17 , 2023 | 12:20 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising