మళ్లీ అదే తీరు..
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:15 PM
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఓటర్ల నమోదు చేర్పులు, మార్పులు తదితర అంశాలపై నియోజకవర్గాల వారీగా రచ్చ సాగుతూనే ఉంది. కొత్త ఓటర్లు చేరికలతో అటు మార్పులు చేర్పు లకు ఓటరు దరఖాస్తులు పరిశీలనకు ఈనెల 29 వరకు గడువు ఉంది.
పెండింగ్‌లోనే 26 వేల దరఖాస్తులు
ఓటర్ల జాబితాపై తొలి నుంచి కుస్తీనే..
అందిన దరఖాస్తులు లక్ష పైబడే..
జాబితాలో ఇంకా కనిపిస్తున్న మృతుల పేర్లు..
కొత్తగా 99 వేలకు పైగా కొత్త ఓటర్లు ఓకే
పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలోనూ తకరారు..
నూజివీడు నియోజకవర్గంలో
అత్యధికంగా 6 వేలకు పైగా పెండింగ్
(ఏలూరు– ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఓటర్ల నమోదు చేర్పులు, మార్పులు తదితర అంశాలపై నియోజకవర్గాల వారీగా రచ్చ సాగుతూనే ఉంది. కొత్త ఓటర్లు చేరికలతో అటు మార్పులు చేర్పు లకు ఓటరు దరఖాస్తులు పరిశీలనకు ఈనెల 29 వరకు గడువు ఉంది. జిల్లా పరిధిలోనే దాదాపు 50 వేలకు పైగా తప్పు ఒప్పులు జరిగినట్టు ఇంతకు ముందే ఫిర్యాదు చేశారు. మృతి చెందిన వారి పేర్లను ఇంకా ఓటర్లుగానే జాబితాలో కొనసాగిస్తున్నారని ఫిర్యాదులో టీడీపీ పేర్కొంది. తాజా సవరణ ప్రకారం జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రక్రియలో మరో 26 వేలకు పైగానే ఓట్లను పెండింగ్‌లో పెట్టారు. తుది జాబితా వచ్చే సరికి ఎన్నికల అధికారులు ఎంత మేరకు తప్పొప్పులు సవరిస్తారన్న అనుమానం తొంగి చూస్తూనే ఉంది.
జిల్లా మొత్తంగా అర్హత ఉన్న ఫారం–6, ఫారం–7 , ఫారం–8 కింద సుమారు లక్షా 26 వేల దరఖాస్తులు వచ్చే వీటిలో 99 వేల 826 దరఖాస్తులను పరిష్కరించారు. వీట న్నింటిని ఓటర్లు జాబితాలో చేర్చినట్టే. పోను మిగతా 26 వేలకు పైగా దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. ప్రత్యే కించి కొత్త ఓటర్లుగా నమోదుకు దాదాపు 55 వేల 169 పైగా దరఖాస్తులు అందగా 46 వేలకు పైగా పరిష్కరించి మరో 9 వేల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. మార్పులు, చేర్పులు కింద ఫోరం–7 కింద దరఖాస్తులు 40 వేల 986 పైగా అందితే వీటిలో 27 వేల దరఖాస్తులను పరిష్కరించి ఇంకో 13 వేలకు పైగా దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. ఫారం–8 కింద 30 వేల 526 దరఖాస్తులు రాగా 26 వేలను పరిష్కరించి మరో 4 వేలకు పైగా పెండింగ్‌లో పెట్టారు. వాస్తవానికి వచ్చే నెల 5 తర్వాత ఓటర్ల తుది జాబితా ప్రక టించాల్సి వస్తుంది. వాస్తవానికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు పెద్దఎత్తున దరఖాస్తులు రావడం అది ప్రత్యేకించి కొన్ని నియోజకవర్గాల్లో అధికార వైసీపీ చక్రం తిప్పేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న 26 వేలకు పైగా దరఖాస్తులను పరిష్కరించేందుకు బీఎల్‌వోలు ఆయా నివాసా లను రీ సర్వే చేయాల్సి ఉంది.
నియోజకవర్గాల వారీగా సవరణ ప్రక్రియ..
ఉంగుటూరు నియోజకవర్గంలో ఫారం–6 కింద 5,844 దరఖాస్తులు రాగా వీటిలో 5,410 ఆమోదించి మరో 434 పెండింగ్‌లో పెట్టారు. ఫారం–7 కింద 5,109 దరఖాస్తులు రాగా 4,526 పరిష్కరించి 493ను పెండింగ్‌లో పెట్టారు. ఫారం–8 కింద 3,806 అందగా 3,221 పరిష్కరించి 242 దరఖాస్తులను పెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ 1,209 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉండగా జిల్లా వ్యాప్తంగా అత్యల్పంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో ఈ నియోజకవర్గమే తొలిస్థానంలో నిలిచింది.
ఎస్టీ రిజర్వు నియోజకవర్గమైన పోలవరంలో అత్య ధికంగా 4,998 దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారు. ఈ నియోజకవర్గంలో కొత్త ఓటర్లు చేరిక కింద 8,892 అంద గా వీటిలో 6,497 పరిష్కరించారు. మార్పులు, చేర్పుల్లో భాగంగా 3,929 దరఖాస్తులు రాగా 2,201లను పరిష్కరిం చి ఇంకో 1,728 దరఖాస్తులను ఈ నియోజకవర్గంలో పెండింగ్‌లో పెట్టారు.
ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన చింతలపూడిలో కొత్త ఓటర్ల నమోదుకు పది వేలకు పైగానే దరఖాస్తులు అందాయి. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా వివిధ రకాల 5,222 దరఖాస్తులను ఇంకా పరిష్కరించలేదు. ప్రత్యేకించి రిజర్వుడు నియోజకవర్గంలో కొత్త ఓటర్లు చేరిక దరఖాస్తులు ఎలా వచ్చాయో ఫారం–7 కింద చేర్పలు, మార్పుల్లో భాగంగా మరింతగా దరఖాస్తులు అధికారులు చేతులకు అందాయి.
నూజివీడు నియోజకవర్గంలో అత్యధిక దరఖాస్తులను 6,339 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. ఈ నియోజక వర్గంలో కొత్త ఓటర్లు చేరికకు 7 వేలకు పైగా, మార్పులు, చేర్పులకు 7,255 లను ఎన్నికల అధికా రులకు అందాయి. అయితే వివిధ కారణాల రీత్యా జిల్లాలోనే అత్యధికంగా ఇక్కడ 6 వేలకు పైగా దర ఖాస్తులను పెండింగ్‌లో పెట్టార ు. వాస్తవానికి ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పొప్పులు దొర్లాయని మొదటి నుంచి నూజవీడు నియోజకవర్గ టీడీపీ నేతలు అటు రాతపూర్వకంగా, ఇటు బహిరంగ వేదికపైన విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏలూరు నియోజకవర్గంలో ఫారం–6 కింద 8,889 దర ఖాస్తులు రాగా 7,635 పరిష్కరించారు. మార్పులు, చేర్పు లకు 7,575 దరఖాస్తులు రాగా 6,240 పరిష్కరించగా మరో 1,335 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు.
దెందులూరు నియోజకవర్గంలో 7,745 కొత్త ఓటర్లుగా దరఖాస్తులు అందగా 6,870 పరిష్కరించారు. మార్పులు, చేర్పుల్లో భాగంగా 5,132 దరఖాస్తులు పరిష్కరించగా వీటిలో 3,408 దరఖాస్తులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి మరో 1,629 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. కైకలూరు నియోజక వర్గంలో 6,043 దరఖాస్తులు కొత్త ఓటర్ల చేరిక కింద అందగా వీటిలో కేవలం 8,041 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో పెట్టారు.
ఇంకా అవసవ్యాలు ఎన్నో..
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఓటర్ల జాబితాకు గడువు దగ్గర పడుతున్న వేళ చాలా నియోజక వర్గాల్లో ఇంకా అపసవ్యంగానే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రత్యేకించి ఒకే డోరు నెంబరు కింద ఎక్కువ మంది ఓటర్లు నమోదు కావడం, చనిపోయిన ఓటర్లను గుర్తించి టీడీపీతో సహా విగతా రాజకీయ పక్షాలు ఫిర్యాదు చేసినా ఇంకా కొన్ని ఇప్పటికి ఓటర్ల జాబితాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. బీఎల్‌వోలు దగ్గర నుంచి మిగతా సిబ్బంది స్వయంగా పరిశీలించి నిర్ణ యాలు తీసుకోవాల్సి ఉండగా చాలామంది వాస్తవ స్థితిగతు లకు దగ్గర కాలేకపోయారనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది. ఫలితంగానే నియోజకవర్గంలో వివిధ రకాల దరఖాస్తులను ఇంకా పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో పెట్టడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఓటర్ల జాబితాలో డబుల్ ఎంట్రీలపై వచ్చిన ఫిర్యాదులను అంతంత మాత్రంగా పరిశీలిస్తున్నారనేది ఇంకో ఆరోపణ ఉంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కలెక్టర్ ప్రత్యేక సమీక్ష
ఏలూరుసిటీ, డిసెంబరు 17: విజయవాడలో ఈనెల 22,23 తేదీల్లో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఎస్పీలతో ఎన్నికల ప్రధానాధికారి వారు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఎన్నికల నిర్వహణ అంశాలపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తుండగా ఇందుకోసం ఆదివారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా వివరాలను క్రోడీకరించి విజయవాడలో జరిగే సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ కోసం మందస్తుగా ఈ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అక్టోబరు 28 నుంచి డిసెంబరు 9వతేదీ వరకు ఫారం– 6, 7, 8 ద్వారా లక్షా 26 వేల 681 దరఖాస్తులు రాగా ఇంతవరకు 99 వేల 826 పరిష్కరించగా మరో 26 వేల 836 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు. వీటిలో ఫారం–6 కింద 9,072, ఫారం–7 కింద 13,332, ఫారం–8 కింద 4,432 పరిష్కరించాల్సి ఉందని వీటిని ఈనెల 18వ తేదీ లోపు పరిష్కరించాలని ఆదేశించామన్నారు. 2024 జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించినప్పటికీ ఎన్నికల నామినేషన్ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని, వీటిని సప్లిమెంటరీ ఓటర్ల జాబితా కింద ప్రకటిస్తామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ శ్రీపూజ, సబ్‌కలెక్టర్ ఆదర్ష్ రాజేంద్రన్, జడ్పీ సీఈవో కెఎస్‌ఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 11:15 PM