రహదారికి స్వచ్ఛందంగా మరమ్మతులు
ABN, First Publish Date - 2023-12-04T01:29:14+05:30
మూల్లంక – పెదలంక ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారికి ఏఎంసీ మాజీ ఛైర్మన్ అయినాల బ్రహ్మాజీరావు, పెదలంక సర్పంచ్ మోకా లక్ష్మీ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఆదివారం స్వచ్ఛందంగా ఆరు కిలోమీటర్ల మేర మరమ్మతులు చేపట్టారు.
కలిదిండి, డిసెంబరు 3 : మూల్లంక – పెదలంక ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారికి ఏఎంసీ మాజీ ఛైర్మన్ అయినాల బ్రహ్మాజీరావు, పెదలంక సర్పంచ్ మోకా లక్ష్మీ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఆదివారం స్వచ్ఛందంగా ఆరు కిలోమీటర్ల మేర మరమ్మతులు చేపట్టారు. రహదారిపై పెద్ద గోతులు పడటంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు, విద్యార్థులు పలు అవస్థలు పడుతున్నారు. దీంతో గుంతల్లో కంకర వేసి పూడ్చి ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అంతరాయం కలగకుండా రహదారికి మరమ్మతులు చేస్తున్నారు. రహదారుల మరమ్మతులకు ఆర్‌అండ్‌బీ అధికారులు సహకరించాలన్నారు. పెదలంక సొసైటీ ఛైర్మన్ తిరుమాని గణపతి, దాసరి రాజు, ఏకో నారాయణ, ఇమ్మానేని రాము, నడకుదిటి ఏసుబాబు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-04T01:29:16+05:30 IST