ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Venkaiah Naidu: అల్లూరి విగ్రహం మోదీ ఆవిష్కరించడం ఎంతో సంతోషం

ABN, First Publish Date - 2023-02-11T11:21:21+05:30

ప.గో. జిల్లా: మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) శనివారం పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో పర్యటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో. జిల్లా: మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) శనివారం పశ్చిమగోదావరి జిల్లా (West Godavari Dist., భీమవరం (Bhimavaram)లో పర్యటిస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) కాంస్య విగ్రహాన్ని (Bronze Statue) సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లూరి విగ్రహం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆవిష్కరించడం తన మనసుకి ఎంతో సంతోషం కలిగించిందన్నారు. స్వాతంత్య్రయం కోసం కృషి చేసిన అనేకమంది మహానుభావుల్లో మొట్టమొదటి వరుసలో ఉండే వ్యక్తి అల్లూరి సీతారామరాజుని కొనియాడారు. సీతారామరాజు స్ఫూర్తిని యువతరానికి తెలియజేయాలన్నారు.

రాష్ట్రంలో ఉండే యువత ఎప్పటికప్పుడు భీమవరం వచ్చి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని సందర్శించాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నానని వెంకయ్య నాయుడు అన్నారు. స్వార్థం, అవకాశవాదం, అవినీతి, అరాచకం, పెరిగిపోతున్న ఈ రోజుల్లో యువత ముందుకు వచ్చి నడుంబిగించవలసిన సమయం ఆసన్నమైందని, ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయన్నారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర పాఠ్యాంశాలలో భాగంగా ఉండాలని, అది చాలా అవసరం.. దీన్ని ప్రభుత్వాలు గుర్తించాలని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.

అనంతరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగే కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొంటారు. తిరిగి 12:10 గంటలకు విష్ణు కళాశాల గెస్ట్‌హౌస్‌‌కు వెళతారు. సాయంత్రం 3:30 గంటలకు కళాశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం ఐదు గంటలకు భీమవరం రైల్వే స్టేషన్‌కు చేరుకుని 5:15 గంటలకు ట్రైన్‌లో బయలుదేరి రాత్రి 7:30కు ఆత్కూరులో స్వర్ణభారతి ట్రస్టుకు చేరుకుంటారు.

Updated Date - 2023-02-11T11:21:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising