ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:00 AM
ఎన్నికల సమయం ఆసన్నమైందని, ప్రతి కార్య కర్త ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభా కర్ పిలుపునిచ్చారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలకు చింతమనేని పిలుపు
పెదవేగి, డిసెంబరు 16: ఎన్నికల సమయం ఆసన్నమైందని, ప్రతి కార్య కర్త ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభా కర్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలో ఈనెల 20న జరుగనున్న ఎన్ని కల శంఖారావం సభను విజయవంతం చేయడంపై దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం శనివారం నిర్వ హించారు. వచ్చే మూడు నెలల సమయం అత్యంత కీలకమని, రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 20న ఎన్నికల శంఖారావం సభను విజయవంతం చేయడంలో సహ కారాన్ని అందించాలన్నారు. నాలుగున్నరేళ్లుగా అధికార వైసీపీ, టీడీపీ నేతలే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులతో వేధిస్తూ వచ్చిందని, వైసీపీ మదం అణచాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలని, దీని కోసం ప్రతి కార్యకర్త కంకణబద్దుడై, చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. బొప్పన సుధాకర్, మాగంటి నారాయణప్రసాద్, లావేటి శ్రీనివాసరావు, నంబూరి నాగరాజు, తాతా సత్యనారాయణ, మాగంటి సురేంద్రనాధ్ చౌదరి, మోరు శ్రావణి, గారపాటి రామసీత, చింతయ్య, కొనకళ్ళ శివమణి, నేతల రవి, మంచినేని శ్రీనివాసరావు, గుత్తా అనిల్ తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం టౌన్: పోలేపల్లి వద్ద నారా లోకేశ్ యువగళం ముగింపు సభ చరిత్రలో నిలిచిపోయేలా జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన గు ర్వాయిగూడెంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను భవిష్యత్ గ్యారెంటీ పేరుతో చేపట్టిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున జరగాలని బూత్‌ల వారీగా సమీక్ష నిర్వహించారు. యువగళం ముగింపు సభను జయప్రదం చేయడానికి ప్రతి కార్యకర్త కదలిరావాలని పిలుపునిచ్చారు. సాయిల సత్య నారాయణ మాట్లాడుతూ మండలంలో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని త్వరితగతిన రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తి చెయ్యాలని కోరారు. కుక్కల మాధవరావు, ఆకుమర్తి రామారావు, బొమ్మాజీ అనిల్, ఎలికే ప్రసాద్, శీలం రామచంద్రరావు, చిటికిన శ్రీను, ఉండవల్లి చంద్రరావు, ఎలికే ప్రసాద్, వెంకటరెడ్డి, రాగాని రామకృష్ణ, లింగాల సత్యనారాయణ, గంధం గోపాలకృష్ణ, కొట్టారు ప్రసాద్, సింహాద్రి రవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 12:00 AM