ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ–జనసేన కూటమి విజయం ఖాయం : గన్ని

ABN, Publish Date - Dec 23 , 2023 | 12:20 AM

రాబోయే ఎన్నికల్లో టీడీపీ–జనసేన కూటమి విజయం ఖాయమని ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు.

భోగాపురంలో ఇంటింటికి కరపత్రాలు అందిస్తున్న గన్ని వీరాంజనేయులు

భీమడోలు/చింతలపూడి/ఏలూరు కార్పొరేషన్‌, డిసెంబరు 22 : రాబోయే ఎన్నికల్లో టీడీపీ–జనసేన కూటమి విజయం ఖాయమని ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు. శుక్రవారం భీమడోలు మండలం భోగాపురం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రతి కుటుంబానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. పార్టీ మండల అధ్యక్షుడు శివబత్తిన వెంకట సత్యనారాయణ, జంగం భాస్కరరావు, ఏసురాజు, జంగం ప్రభాకరరావు, కుచ్చర్ల ప్రకాశం, మురళి, ఇజ్రాయిల్‌, బాల ఏసు, మరడాని రాఘవులు, కె.ప్రసంగి తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి పట్టణ టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో నగర పంచాయతీలోని 148 బూత్‌లో బాబు ష్యూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమాన్ని పక్కాల వెంకటేశ్వరరావు, జనసేన మండల కన్వీనర్‌ చీదరాల మధుబాబు నిర్వహించి పత్రాలను బూత్‌లోని ప్రజలకు అందించారు. మన్యం సత్తిబాబు, పల్లె మున్న, పరదేశి, వేములపల్లి సూరిబాబు, అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జనసేన కార్యాలయంలో శుక్రవారం క్రైస్తవ సోదరులకు అందచేసేందుకు ముద్రించిన 2024 క్యాలెండర్లను జనసేన జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు కృపతో క్రిస్మస్‌ పండుగ నుంచి 2024లో ప్రజలందరూ ఆనందంగా జీవిస్తారనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. జనసేన నాయకులు సిరిపల్లి ప్రసాద్‌, నగిరెడ్డి కాశీ నరేష్‌, ఒబిలిశెట్టి శ్రావణకుమార్‌ గుప్త, సరిది రాజేష్‌, పైడి లక్ష్మణరావు, కందుకూరి ఈశ్వరరావు, నిమ్మల శ్రీనుతోపాటు వీర మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 12:20 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising