ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉల్లి–బంగాళదుంపకు తేడా తెలియని వ్యక్తి సీఎం

ABN, First Publish Date - 2023-12-10T23:35:24+05:30

ఉల్లిపాయకి బంగాళదుంపకు వ్యత్యాసాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలుసుకోలేకపోతున్నారని, ఇటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం మన దౌర్భాగ్యం అని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఎద్దేవా చేశారు.

ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఎద్దేవా

కాళ్ళ, డిసెంబరు 10 : ఉల్లిపాయకి బంగాళదుంపకు వ్యత్యాసాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలుసుకోలేకపోతున్నారని, ఇటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం మన దౌర్భాగ్యం అని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఎద్దేవా చేశారు. జువ్వలపాలెంలో ‘బాబుతో నేను, ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను తెలుసుకోవడంతో పాటు పెరిగిన నిత్యావసర, విద్యుత్‌, గ్యాస్‌ ధరలతో పాటు ఇంటి పన్ను వివరాలను ప్రజలకు వివరించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మద్యానికి బానిసలైన తమ భర్తలు సంపాదిం చినదంతా మద్యానికే చెల్లిస్తున్నారని మహిళలు తన వద్ద వాపోయారని తెలిపారు. మద్యపానం నిషేధం అమలు చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్‌ మాట తప్పారని విమర్శించారు. రాబోయేది తెలుగుదేశం–జనసేన ప్రజాప్రభుత్వమేనన్నారు. టీడీపీ నాయకులు గోకరాజు నాగరాజు, మండల అధ్యక్షుడు జీవీ నాగేశ్వరరావు, నడింపల్లి విశ్వనాథరాజు, తోట ఫణిబాబు, సరిపల్లి కిషోర్‌, బొత్స గణేష్‌, లక్ష్మీనారాయణ, తెలుగుయువత మండల అధ్యక్షుడు మంతెన కోదండరామరాజు, కట్రెడ్డి శ్రీను, మహాశక్తి టీమ్‌ సభ్యులు, పాల్గొన్నారు.

బాబుతోనే యువతకు ఉపాధి

నరసాపురం టౌన్‌ : చంద్రబాబుతోనే యువతకు ఉపాధి దొరుకుతుందని టీడీపీ నాయకులు అన్నారు. ఆదివారం పట్టణంలోని 21వ బూత్‌లో బాబు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బాండ్లను అందించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో తప్పుడు కేసులు, దోపిడీ తప్ప సంక్షేమం, అభివృద్ధి ఏమి లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుడాల రామకృష్ణ, గుడాల సునీత, బస్వాని నాగమణి తదితరులు పాల్గొన్నారు.

వీరవాసరం : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రూపొందించిన మినీ మ్యేనిఫెస్టో రాష్ట్ర ప్రజల సంక్షేమానికి గ్యారెంటీ అని టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. ఆదివారం మండలంలోని రాయకుదురు , నడపనవారిపాలెం, వడ్డిగూడెం, కొణితివాడ గ్రామాల్లో ‘బాబు ష్యూరిటీ...భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రచారం చేస్తూ టీడీపీ అమలు చేసే సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మండలశాఖ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాసరావు, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు కడలి వాసు, శలాకోటి రామలింగం, అందే వీరకోట సుబ్రహ్మణ్యం, బూత్‌ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T23:35:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising