ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పుకార్ల షికార్లు..

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:16 AM

అధినేత చేయాల్సిన నిర్ణయాలను నియోజకవర్గ నాయకులు ప్రచారం చేస్తు న్నారు. చర్చకు కూడా రాని అంశాలతో పుకార్లు రేపుతున్నారు. నయా పొత్తుల ప్రస్తావనతో కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నారు.

నియోజకవర్గంలో అభ్యర్థిత్వంపై అలజడి

అవకాశాలు లేకనే నయా పుకార్లా?

కార్యకర్తల్లో గందరగోళం

రేపుతున్న కొందరు నాయకులు

కైకలూరు నియోజకవర్గంలో గరం గరం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

అధినేత చేయాల్సిన నిర్ణయాలను నియోజకవర్గ నాయకులు ప్రచారం చేస్తు న్నారు. చర్చకు కూడా రాని అంశాలతో పుకార్లు రేపుతున్నారు. నయా పొత్తుల ప్రస్తావనతో కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నారు. తామంటే తామే అభ్యర్థులమని చేస్తున్న వ్యక్తిగత ప్రచారం ఇప్పుడు కైకలూరు నియోజకవర్గ టీడీపీలో అలజడికి తెర తీస్తోంది. మాజీ ఎమ్మెల్యే, మండల స్థాయి నాయకులు మొదలు వార్డు స్థాయి నాయకులు సైతం తామే అభ్యర్థులమని ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈ పుకార్లు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్లో అసహనా నికి కారణ హేతువులవుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో మార్పు కావాలని ప్రజానీకం అభిలాషిస్తోన్న తరుణంలో చంద్రబాబు అరెస్టు, బెయిల్‌ అనంతరం అందరూ టీడీపీ వైపు చూస్తున్నారు. అవే అభిప్రాయాలు కైకలూరు నియోజక వర్గంలోనూ వేళ్లూనుకున్నాయి. ఇది స్థానిక నాయకుల్లో పోటీ పెంచింది. ఎవరికి వారు ఎమ్మెల్యే అభ్యర్థులమని ప్రచారం చేసుకుంటున్నారు. కొందరైతే ఆర్భా టాలకు పోకుండా పార్టీ జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు అండగా నిలుస్తు న్నారు. ఇదిలా ఉండగా తాను పార్టీ మారుతున్నానని ప్రచారం చేసుకుంటూ ఓ నాయకుడు టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు సైలెంట్‌ హింట్‌ ఇవ్వడంతో టీడీపీలోనూ ఆనందాలు వెల్లివిరిశాయి. వైసీపీ అరాచకాలకు చెక్‌ పెట్టాలంటే ఆ వ్యక్తే బాగుం టుందని రాజకీయ చర్చలు జరిగాయి. అయితే స్థానికంగా సీటు ఆశిస్తున్న మరికొందరు ఆ పుకార్లను వ్యతిరేకించారు. మరోవైపు నియోజక వర్గంలో నయా పుకార్లు పార్టీలో స్థానికంగా అలజడి రేపుతున్నాయి. చర్చకు కూడా రాని ఓ పార్టీతో త్వరలో టీడీపీ పొత్తు పెట్టుకోబోతుందని, ఆ పార్టీ తర పున ఓ నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. పొత్తులపై తుది నిర్ణయం పార్టీ అధినేతదే అని తెలిసినా కొందరు కావాలని సృష్టిస్తున్న ఈ పుకార్లు స్థానికంగా కార్యకర్తలో గందరగోళం సృష్టిస్తున్నాయి.

గతంలోనూ ఇదే తంతు

నియోజకవర్గంలో టీడీపీ తరపున గతంలో ఇన్‌చార్జి కమిటీ నాయకత్వం స్థానికంగా పనిచేసింది. ఆ సమ యంలో పలు భిన్నాభిప్రాయాలున్నా ఎక్కడా కార్య కర్తలు గందరగోళానికి లోనవ్వలేదు. ఈ క్రమంలో 2014లో బీజేపీకి సీటు ఖరారు చేసిన తర్వాత టీడీపీలో కొంత బేధాభిప్రాయాలు వచ్చాయి. స్థానికంగా కష్టపడ్డ చాలా మందికి న్యాయం జరగలేదంటూ పలువురు అప్పట్లో అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. కానీ, అప్పటి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పనిచేసిన కామినేని శ్రీనివాస్‌ సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభు త్వాల నుంచి నిధులు భారీగా తెప్పించి, స్థానికంగా అభివృద్ధి చేయగలిగారు. కాగా 2019 తర్వాత నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఒక నాయకుడిని పార్టీ నియమిం చింది. ప్రస్తుతం మాదిరిగానే అప్పట్లో రేగిన పుకార్లు ఆయనలో అభద్రతా భావానికి కారణమ య్యాయి. పైపెచ్చు అధికారంలో ఉన్న వైసీపీ ఇచ్చిన భారీ ఆఫర్‌కు ఆయన లొంగి పార్టీ ఫిరాయించారనే గుసగుసలు విన్పిస్తున్నాయి. దాదాపు ఏడాదిగా పార్టీని కార్యకర్తలే తమ భుజాలపై మోస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన ఓ సామాజికవర్గం నుంచి మరో నాయకుడి పేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వినిపిస్తోంది. ఆయన ఎక్కడా ఆ ప్రస్తావనతో సంబంధం లేకుండా తన పని తాను చేస్తున్నారు. ఈలోపే తెరపైకి వస్తున్న ప్రచారాలపై చర్చలు జరుగు తున్నాయి. టీడీపీ, జనసేనలో అవకాశాలు మూసుకు పోవడం వల్లే కొందరు రూటు మార్చి కొత్త పార్టీ ప్రస్తావన తెరపైకి తెస్తున్నారనే వాదన తాజా పుకార్లపై వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఏడాదిగా ఇన్‌చార్జి నియమాకం లేకపోవడం ప్రస్తుత పరిస్థితికి ఒక కారణమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల స్థానిక నాయకులు త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు అధిష్ఠానాన్ని సంప్రదించారని తెలుస్తోంది. కమిటీ ఏర్పాటుకు తొలుత సరే అన్నా అనంతరం ఆ కమిటీ ఏర్పాటు జరగలేదు. త్రిసభ్య కమిటీ కంటే ఇన్‌చార్జి నియామకానికే అధిష్ఠానం మొగ్గు చూపుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Updated Date - Dec 17 , 2023 | 12:16 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising