ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ పాలనలో బీసీలకు నష్టం

ABN, First Publish Date - 2023-11-10T23:39:12+05:30

‘బీసీలంతా ఐక్యంగా ఉన్నప్పుడే మనకు కావాల్సినవన్ని సాధించు కోచ్చు. బీసీలకు కేంద్రంలోని అన్ని ప్రభుత్వాలు తీరని అన్యాయం చేశాయి. బీసీల కులగణన చేయకుండా ప్రభుత్వాలన్ని కాలయాపన చేస్తున్నాయి.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు

జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలి

బీసీ సెల్‌ సమావేశంలో మాజీ మంత్రి యనమల

ఏలూరు టూటౌన్‌, నవంబరు 10: ‘బీసీలంతా ఐక్యంగా ఉన్నప్పుడే మనకు కావాల్సినవన్ని సాధించు కోచ్చు. బీసీలకు కేంద్రంలోని అన్ని ప్రభుత్వాలు తీరని అన్యాయం చేశాయి. బీసీల కులగణన చేయకుండా ప్రభుత్వాలన్ని కాలయాపన చేస్తున్నాయి. జనాభా ప్రతి పాదికన రిజర్వేషన్లు కల్పించిన పార్టీలకే బీసీలు మద్దతు ఇవ్వాలి’.. అంటూ టీడీపీ పొలెట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ ఆధ్వర్యంలో ఏలూరులో స్వాగత్‌ హోటల్‌లో టీడీపీ, జనసేన, సీపీఐ, బీఎస్పీ, సమాజ్‌వాది పార్టీల రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యనమల హాజరై మాట్లాడుతూ గతంలో కేంద్రంలోని యూపీఐ, ఎన్‌డీఐ ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లను పట్టించుకోలేదని, మం డల కమిషన్‌ చెప్పినట్టు బీసీలకు జనాభా ప్రతి పాదికన ఆనాటి ప్రధాని వీపీ సింగ్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ ఎన్టీ రామారావు నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో సాధ్యమైనంత వరకు జనసేన, టీడీపీల నుంచి సాధ్యమైనంత మంది బీసీలను అభ్యర్థులుగా నిలబెడతామన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్లు రాని వారికి అధికారంలోకి రాగానే నామినేషన్‌ పదవులు ఇస్తామ న్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలంతా ఐక్యంగా ఉండి తెలుగుదేశం, జనసేన పార్టీలను గెలిపించి అధికారం లోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీసీలు అభివృద్ధి చెందారంటే అది టీడీపీ పార్టీ, ప్రభుత్వం వల్లనేనన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటానికి ముం దుకు రావాలన్నారు. బీసీలు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చన్నారు. గత నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేసిందన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ దువ్వారపు రామా రావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీ సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లించి బీసీలకు అన్యాయం చేసిందని, రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే బీసీలకు రక్షణ చట్టం తెస్తామన్నారు. 30 సంక్షేమ పథకాలను వైసీపీ దుర్మార్గంగా రద్దు చేసిందన్నారు. జనసేన ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి, ఏలూరు ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ అసెంబ్లీ స్థానాల్లో 50 శాతం బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలన్నారు. బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడమే కాకుండా వీటికి చెందిన 75 వేల కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. బడ్జెట్‌లో 50 శాతం నిధులు బీసీలకు కేటాయించే విధంగా టీడీపీ, జనసేన మేనిఫెస్టోలు రూపొందిస్తామన్నారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి ఘంటశాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీలకు ఉపాధి లేకుండా చేశారని, విదేశీ విద్యను దూరం చేశారన్నారు. కార్యక్రమంలో 30 బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్‌ చక్రవర్తి, బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి, కాశీ నగేశ్‌, టీడీపీ నాయకులు పాలి ప్రసాద్‌, ఉపాఽ్పల జగదీశ్‌ బాబు, దాసరి శ్యామ్‌ సుందర్‌ శేషు, కొండపల్లి రవి, వెంకటేశ్వ రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-10T23:39:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising