ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సహకారంపై నిర్లక్ష్యం

ABN, First Publish Date - 2023-12-11T00:16:50+05:30

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై 40 రోజులు అవు తోంది. అయినా దీనికి సంబంధించిన కీలకమైన ఆర్థిక వనరుల కల్పనలో అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది.

అడ్వాన్సులు చెల్లించ లేదు

కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు లేవు

నిర్వహణ ఖర్చులకు కూడా మొండిచేయి

సొసైటీలకు రూ.70 కోట్లు ఎగవేత

పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం

భీమవరం, డిసెంబరు 10 : ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై 40 రోజులు అవు తోంది. అయినా దీనికి సంబంధించిన కీలకమైన ఆర్థిక వనరుల కల్పనలో అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. గత పంట కొనుగోలు సమయంలో రైతులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. అదనపు ధాన్యం తీసుకోవడం దగ్గర నుంచి బిల్లులు ఆలస్యంగా చెల్లింపు దాకా అష్టకష్టాలు పడ్డ సంగతి తెలిసిందే. మళ్లీ ప్రస్తుతం పంట కాలం మొదలై 40 రోజులు కావస్తోంది. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టింది. ఇంతలో గత వారం తుఫానుతో రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. ఇది ఒకెత్తయితే సుమారు 60 శాతం వరకు పంట కొనుగోలు చేసి నప్పటికీ ఇంతవరకు వీటిని నిర్వహిస్తున్న సహకార సంఘాలకు నిర్వహణ నిమిత్తం రూపాయి కూడా కేటాయించలేదు. ఈ ప్రభావం ఇప్పుడు ధాన్యం కొనుగోలు విధులు నిర్వహించే కాంట్రాక్టు సిబ్బంది వేతనాలపై పడింది.. ఈరోజు వరకు 80 శాతం మందికి వేతనాలు చెల్లించలేదు. ఇప్పుడు రైతులే కాదు..విధులు నిర్వహించే సిబ్బంది, సొసైటీలు కూడా కష్టాల్లో ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల నియమావళి పేరుతో సహకార వ్యవస్థను ఆర్థికంగా దెబ్బతీస్తూ నిర్వీర్యం చేయడం ప్రారంభించింది. ధాన్యం కొనుగోలు బాధ్యతను సొంత వ్యవస్థగా ఏర్పడిన ఆర్బీకేలకు అప్పగిం చింది. నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలను సహకార సంఘాలకు పెంచింది. వాటికి నిధులు సమకూర్చడంలో పూర్తి నిర్లక్ష్యం వహించింది. నాలుగేళ్లుగా ధాన్యం కొను గోలు నిర్వహణ ఖర్చుల ఆర్థిక భారం సహకార సంఘాల పైనే నెట్టివేస్తోంది. ప్రస్తుత రబీ పంటకు నిర్వహణకు అడ్వాన్సుల కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వ లేదు. దీంతో ఇప్పుడు వాటి పరిధిలో పనిచేసే కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించని పరిస్థితి నెలకొన్నది.

సిబ్బంది జీతాలకు కట కట

జిల్లాలో 314 ఆర్బికేలు ద్వారా ధాన్యం కొనుగోళ్లు గత నవంబరు ఒకటి నుంచి ప్రారంభమయ్యాయి. దీని కోసం జిల్లావ్యాప్తంగా 942 మంది కాంట్రాక్టు సిబ్బంది నియమించారు. ప్రభుత్వమే నోటిఫికేషన్‌ ద్వారా 462 మందిని రెండు దఫాలుగా నియమించగా, మిగిలిన సిబ్బందిని సొసైటీలు భర్తీ చేసుకున్నాయి. ఇందులో టెక్నికల్‌ సహాయకులకు వేతనం రూ.15 వేలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.12 వేలు, సహా యకులకు రూ.9 వేలు ఇచ్చేలా అగ్రిమెంట్‌తో పోస్టు ఇచ్చారు. 2నెలల పాటు విధులు నిర్వహణ, అదనంగా పనిచేసిన రోజులకు ప్రత్యేక వేతనం చెల్లిం చేలా ఒప్పందం చేశారు. అయితే వారు విధులు ప్రారంభించి 40 రోజులు దాటింది. వీరికి వేతనాలు చెల్లించలేదు.తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో మాత్రం 20 శాతం మందికి వేత నాలు అందాయి.. మిగిలిన వారికి అందలేదు. ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుందని అధికారులు చెప్పారు. తమ దగ్గర నిధులు లేవు కాబట్టి వేతనాలు చెల్లించలేమని సొసైటీలు చెపుతున్నాయి.అడ్వాన్స్‌ కూడా ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఏడాదిలో రెండు సీజన్లకు ప్రభుత్వం అడ్వాన్సు సొమ్ములు చెల్లించేది. అయితే ప్రస్తుత ప్రభుత్వం కొంతకాలంగా అడ్వాన్సులు నిలిపివేసింది. ఏ–గ్రేడ్‌ సొసైటీలకు మూడు లక్షలు, బి–గ్రేడ్‌ సొసైటీ లకు రెండు లక్షలు సి–గ్రేడ్‌ సొసైటీలకు రూ.లక్ష ఇస్తూ ఉండేవారు. 2021లో ఖరీఫ్‌, రబీ పంటకు అడ్వాన్స్‌లు ఇచ్చారు. 2022లో ఒక్క రబీకి ఇచ్చి ప్రస్తుతం నిలిపి వేశారు. మొత్తం మూడు పంటల కాలం నుంచి అడ్వాన్సులు నిలిపివేయడంతో సొసైటీలకు తీవ్ర ఆర్థిక భారంగా మారింది. నిర్వహణ ఖర్చులు కూడా ఆర్థికంగా రైతుల సొమ్ములను వాడాల్సి వస్తోంది.

ధాన్యం కమీషన్‌ ఎగవేత

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా ధాన్యం కొనుగోలు చేస్తున్న సహకార సంఘాలకు కమీషన్‌ ఎగవేసింది. ఏడాదిలో రెండు పంటల కాలానికి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ఉద్యోగులు సిబ్బంది శ్రమపడిన ఫలితం కమిషన్‌ రూపంలో వచ్చి సొసైటీల ఆర్థిక పరిపుష్టికి సహకరిస్తోంది. ఏ– గ్రేడ్‌ ధాన్యంలో క్వింటాకు రూ.32, సాధారణ రకానికి రూ.31.25 కమీషన్‌గా ఇచ్చేవారు.. దీనివల్ల ఏటా కోట్లాది రూపాయలు సొసైటీ లకు ఆర్థికంగా పరిపుష్టి కలిగేది. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. పైగా నిర్వహణ ఖర్చులు భారం పెరిగుపోవడంతో సొసైటీలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుత పంట కాలం వరకు ఉమ్మడి జిల్లా సహకార సంఘాలకు రూ.70 కోట్ల వరకు కమిషన్‌ సొమ్ములు నిలిచిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో రెండు పంట లకు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొమ్మిది పంటలకు సహకార సంఘాల బకా యిలు పెండింగ్లో ఉండి పోగా సహకార సంఘాల నిర్వహణ ఖర్చులు ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి.

Updated Date - 2023-12-11T00:16:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising