ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దాళ్వాకు దారేది?

ABN, First Publish Date - 2023-11-10T23:26:51+05:30

గోదావరి ఒడ్డున కరువుఛాయలు చాన్నాళ్ల తర్వాత అలుముకున్నాయి. సార్వాలో ప్రతికూల వాతావరణం అడుగడుగునా అన్ని మండలాలను తాకింది.

సార్వాలో వేల ఎకరాల్లో చేజారిన పంట

గోదారి తీరాన కరువు ఛాయ

డిసెంబరుకు ముందే అడుగంటిన జలాలు

గోదావరిలో అంతంత మాత్రమే నీటి లభ్యత

మంత్రులు, ఎమ్మెల్యేలకు పట్టదు.. రైతుల గగ్గోలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

గోదావరి ఒడ్డున కరువుఛాయలు చాన్నాళ్ల తర్వాత అలుముకున్నాయి. సార్వాలో ప్రతికూల వాతావరణం అడుగడుగునా అన్ని మండలాలను తాకింది. ఏలూరు జిల్లాలో 2 లక్షల 70 వేల ఎకరాల్లో సార్వా సాగు చేయాల్సి ఉండగా, ఈసారి రెండు లక్షల ఎకరాలకు పడిపోయింది. 70 వేల ఎకరాల్లో పంట ఛాయే కనిపించలేదు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉండగా ఆ స్థాయిలో ఎక్కడా దిశ, నిర్దేశం లేదు. పశ్చిమ డెల్టా ఆయ కట్టు ఏడు మండలాల్లో లక్షా ఆరు వేల ఎకరాల్లో పంట సాగు చేస్తారు. గోదావరి నుంచి సక్రమంగా నీరు కాల్వలకు విడుద లైతేనే ఇంత విస్తీర్ణంలో పంటకు రైతులు రంగంలోకి దిగుతారు. ఈసారి పరిస్థితి అంతంతమాత్రంగానే మారింది. వాస్తవానికి ఎన్నడూ లేని విధంగా ప్రకృతిలో విపరీత ధోరణి కనిపించింది. సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో మండుటెండలు కాశాయి. భూగర్భ జలాలు పడిపోయాయి. మెట్టలో రైతులంతా బోర్ల మీద ఆధారపడే వ్యవసాయం చేస్తారు. భూమిలో తేమ శాతం అట్టడుగుస్థాయికి చేరింది. ఫలితం పంటకు నీరందని దైన్యం. కరువో, కాటకమో అంటూ రైతులు గగ్గోలు పెడుతుంటే ఆ పదమే నేరమన్న ట్టు వైసీపీ సర్కార్‌ కొందరి నోళ్లు మూయిం చింది. అధికార యంత్రాంగం రంగంలోకి దిగితే గాని 12 వేల ఎకరాల్లో వరి, పత్తి, మినుము, చెరకు వంటి పంటలు పూర్తిగా నష్టపోయినట్టు ప్రాఽథమిక అంచనా వేయలేకపోయారు. నష్ట పోయిన రైతులకు పంటల బీమా వర్తింపచేసే విషయం, ఇన్‌ పుట్‌ సబ్సిడీ అందించే విషయం, పంట నష్టం తాత్కాలికంగా అందిం చడం వంటి ప్రధాన చర్యలను పక్కన పెట్టేశారు. పంట పండించిన రైతులంతా దాదాపు మూడొంతులు మంది కౌలు రైతులే. పంట పెట్టుబడి ఎకరాకు వేలల్లో కోల్పోయారు. అసలే అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తే వీరికి చివరికి మిగిలింది కష్టం, నష్టమే. కుక్కునూరు, వేలేరుపాడుల్లో పత్తి పంట నాశనమైంది. నీరు లేక నేలకరిచింది. ఒకప్పుడు ఇలాంటి కరువు ఛాయలను చూసిన మండలవాసులు తాజాగా జరిగిన నష్టాన్ని సర్కారుకు ఏకరువు పెట్టేందుకు ప్రయత్నిస్తే.. ఇవన్నీ పోలవరం ప్రాజెక్టు కింద సేకరించిన భూముల్లోని పంటలే. ఇప్పటికే ఆయా భూములకు పంట పరిహారం చెల్లించాం కాబట్టి ఇక కొత్తగా సీన్‌ లేదన్నట్టు ముఖాన చెప్పేస్తున్నారు. భూమిని నమ్ముకున్న రైతులు ఎప్పటి మాదిరి ఈసారి పంట వేసి నష్టం కొని తెచ్చుకున్నారు. ఈ మండలాల్లో రైతు కష్టం కాస్తా గోదారి పాలైనట్టే. ఓవైపు నష్టపరిహారం రాదు. పంటల బీమా వర్తించదు.

దాళ్వా ఎలా గట్టెక్కిస్తారు ?

సార్వాలో వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. నవంబరు మధ్య వారం నుంచి డిసెంబరు మొదటి వారంలోపే దాళ్వా ఆరంభం కావాలి. ఇప్పుడున్న పరిస్థితులు ప్రతికూలంగా మారినట్టు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమలో గోదావరి కాల్వల కింద నాలుగు లక్షల 60 వేల ఎకరాల్లో ఆయకట్టు ఉంది. విభజిత జిల్లాల్లో ఒక్క ఏలూరు నుంచి దాళ్వా కింద లక్షా 20 వేల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి ఏలూరు జిల్లాలో అత్యధికంగా మెట్ట ప్రాంతం. అందువల్ల ఎర్రకాల్వ, తమ్మిలేరు, కొవ్వాడ కాల్వ ప్రాజెక్టుల నుంచి ఏటా 16 నుంచి 18 వేల ఎకరాల్లోపు సాగు నీటిని అందించే ప్రయత్నం చేస్తారు. ఆ మేరకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తారు. దాళ్వాలో ప్రతీసారి గోదావరిలో నీటి లభ్యత కొంత అపసవ్యంగానే ఉంటూ వచ్చింది. డిసెంబరు నుంచి మార్చి వరకు గోదావరిలో వరద నీటి లభ్యత 45 టీఎంసీలుగా ఉంటుంది. తాజా లెక్కల ప్రకారం ఇప్పటికే ధవళేశ్వరంలో నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉండగా, పోలవరం ప్రాజెక్టులో 14 నుంచి 16 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నట్టు చెబుతున్నారు. దీనిని అంచనా వేసి ముందస్తుగా రైతులకు తాజా పరిస్థితులను వివరించి ఆ మేరకు పంట ఏ మాత్రం సాగు చేయాలి, వంతుల వారీ విధానం ఎలా అమలు చేయాలి, సీలేరు నుంచి ఎంత మేర జిల్లాలకు రాబట్టాలనే అంశంపై ప్రతీసారి పటిష్ట ప్రణాళిక అంటూ ఉంటూ వచ్చేది. ముందస్తుగానే నీటిపారుదల సలహా సంఘ సమావేశాన్ని ఏర్పాటుచేసేవారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక నిర్ణయాలు తీసుకునేవారు. నాలుగేళ్లుగా ఈ సమావేశం ప్రాధాన్యత కోల్పోయింది. అధికారులు తీసుకున్న నిర్ణయాలకు ప్రజా ప్రతినిధులు తలూపే పరిస్థితి వచ్చింది. సార్వాలోనే కరువు తరుముకొచ్చి మెట్ట రైతు పూర్తిగా నష్టాల పాలయ్యాడు. ఇంత జరిగితే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఒక్కరూ నోరెత్త లేదు. రైతుకు కాస్త విశ్వాసం కలిగేలా వారి దగ్గరకు వెళ్లి పరామర్శించనూ లేదు. బస్సు యాత్రలు, రాజకీయ కార్యకలాపాల్లో వీరంతా బిజీ. ఓట్లు సమయం దగ్గర పడుతున్న వేళ తమకేమీ కనపడదు. వినపడదనే ధోరణి.

రైసు మిల్లర్లు బ్యాంక్‌ గ్యారెంటీలు

ఎప్పటికి ఇచ్చేనో?

ముదినేపల్లి రూరల్‌, నవంబరు 10 : వరి కోత యంత్రాలతో కోసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. మరో పక్క ప్రభుత్వానికి రైస్‌మిల్లర్లు నేటి వరకు బ్యాంక్‌ గ్యారెంటీలు సమర్పించలేదు. దీంతో ధాన్యం కొనుగోలు పూర్తిస్థాయిలో జరుగుతాయా..? అని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది వరి కోత యంత్రాలతో కోసిన ధాన్యం ముమ్మరంగా వచ్చిన తరుణంలో పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణ చేసి ఆయా రైసు మిల్లర్లకు ధాన్యం పంపించడానికి బ్యాంక్‌ గ్యారెంటీలు సకాలంలో సమర్పించకపోవడంతో రైతులతో పాటు అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాదీ ఆ సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ముందుగానే రైస్‌మిల్లర్లతో సమావేశం ఏర్పాటుచేసి బ్యాంక్‌ గ్యారెంటీలను సమర్పించి ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండాలని సూచించినా మిల్లర్లు నవంబరు సగం రోజులు పూర్తి కావొస్తున్నా ఇప్పటి వరకు బ్యాంక్‌ గ్యారెంటీలను సమర్పించకపోవడం గమనార్హం. జిల్లాలో మొత్తం 100 రైసు మిల్లులు ప్రభుత్వం నుంచి ధాన్యం సేకరిస్తున్నాయి. వాస్తవానికి ఒక్కొక్క మిల్లు సామర్థ్యాన్ని బట్టి రూ. రెండు కోట్ల నుంచి రూ.ఐదు కోట్ల వరకు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలి. ఒకేసారి కోట్ల రూపాయలు చెల్లించాలంటే తమకు భారంగా పరిణమించిందని మిల్లర్లు చెబుతు న్నారు. తమ మిల్లులను నమోదు చేసుకోవడానికి ఒక్కో మిల్లర్‌ రూ.50 లక్షల చొప్పున 50 కోట్లు బ్యాంక్‌ గ్యారెంటీలు రేపో, మాపో సమర్పించడానికి సిద్ధమవు తున్నారు. అరకొరగా బ్యాంక్‌ గ్యారెంటీలు చెల్లిస్తే ధాన్యం సేకరణకు మిల్లర్లకు ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయిలో యంత్రాలతో కోసిన ధాన్యం ఒకేసారి వచ్చినప్పుడు బ్యాంక్‌లు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో చెల్లించని కారణంగా ధాన్యాన్ని అయా మిల్లులకు కేటాయించాలంటే అధికారులకు సైతం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నిబంధనల మేరకు మిల్లర్ల వద్ద నుంచి పూర్తిస్థాయిలో బ్యాంక్‌ గ్యారెంటీలను తీసుకుని తమ ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే వారం రోజులుగా యంత్రాలతో కోసిన ధాన్యంను రైతులు ఆర్‌బీకే కేంద్రాలకు తీసుకెళ్తూ తేమ శాతాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెలాఖరు నాటికి మిల్లర్ల వద్ద నుంచి పూర్తిస్థాయిలో బ్యాంక్‌ గ్యారెంటీలు తీసుకోకుంటే గతేడాది ఎదురైన సమస్యలే ఇప్పుడు తప్పవని రైతులు వాపోతున్నారు.

Updated Date - 2023-11-10T23:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising