ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ధాన్యం కొనుగోళ్లు ఇంకెప్పుడు..?

ABN, First Publish Date - 2023-11-10T00:16:23+05:30

జిల్లాలో ఖరీఫ్‌ వరి కోతలు ప్రారంభమైనా కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు.

కేంద్రాలు తెరిచినా ప్రారంభం కాని కొనుగోళ్లు

రైతులకు అందని గోనెసంచులు

తక్కువ ధరకు దళారులకు అమ్మి నష్టపోతున్న రైతులు

ఏలూరు సిటీ, నవంబరు 9 : జిల్లాలో ఖరీఫ్‌ వరి కోతలు ప్రారంభమైనా కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఖరీఫ్‌లో 5.30 లక్షల టన్నుల ధాన్యం దిగుబడు లు వస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయడా నికి అక్టోబరు 26వ తేదీ నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారం భించినట్టు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. జిల్లాలో 261 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఽధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జిల్లా పౌరసర ఫరాల సంస్థ కార్యాచరణ రూపొందించింది. రైతులకు కనీస మద్దతు ధర కల్పించి వారి వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జిల్లాలో 133 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సహకార సొసైటీలలో 84 కేంద్రాలు, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 47 కేంద్రాలు, ఎఫ్‌పీవోల ద్వారా రెండు కేంద్రాలు ద్వారా ధాన్యం కొనుగోలును 261 ఆర్‌బీకేలకు అనుసంధానించారు. సేకరించిన ధాన్యాన్ని ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఎంపిక చేసిన రైస్‌ మిల్లులకు తరలిస్తారు. దాదాపుగా 15 రోజులు కావొస్తున్నా ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాక పోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఒక పక్క వర్షాలు భయపెడుతున్నాయని కోతలు కోసిన ధాన్యం తడిసి పోతోందని, ఆ ధాన్యాన్ని ఆరబెట్టడానికి సరైన టార్ఫాలిన్‌లు రైతుల వద్ద లేవని చెబుతు న్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నా ఇంకా గోనె సంచులు ఇవ్వడం లేదని రైతులు చెబుతు న్నారు. ఇప్పటి వరకు సుమారు ఐదువేల ఎకరాల్లో వరి మాసూళ్లు పూర్తికాగా, ఆ ధాన్యాన్ని ఎక్కడ అమ్మాలో తెలియని పరిస్థితుల్లో దళారులకు ధాన్యాన్ని అమ్మే పరి స్థితులు ఏర్పడ్డాయి. 75 కిలోల బస్తాకు ఏ–గ్రేడ్‌కు రూ.1652.25, సాధారణ రకానికి రూ. 1637.25 కాగా ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో 75 కిలోల ధాన్యం బస్తా రూ. 1280కే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద ఽగోనె సంచులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల కోసిన వరి పంట తడిసిపోతోంది. ధాన్యంపై కప్పేందుకు టార్ఫాలిన్‌లను సబ్సిడీపై అందించాలి. తేమశాతం నిబంధనలు మార్చాలి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలి’.. అంటూ ఏపీ రైతు సంఘ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-11-10T00:16:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising