ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సందడిగా కార్తీక వనసమారాధనలు

ABN, First Publish Date - 2023-12-04T00:13:40+05:30

కార్తీకమాసం సందర్భంగా ఆదివారం వనసమారాధనలు సందడిగా జరిగాయి. పట్టణంలోని శ్రీలక్ష్మి కల్యాణ మండపంలో బ్రాహ్మణుల సమారాధన జరిగింది. కార్యక్రమానికి చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జిన్నూరు కాపు వనసమారాధనలో ఎమ్మెల్యే నిమ్మల

నరసాపురం టౌన్‌/మొగల్తూరు, డిసెంబరు 3: కార్తీకమాసం సందర్భంగా ఆదివారం వనసమారాధనలు సందడిగా జరిగాయి. పట్టణంలోని శ్రీలక్ష్మి కల్యాణ మండపంలో బ్రాహ్మణుల సమారాధన జరిగింది. కార్యక్రమానికి చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్రాహ్మణ సంఘ నాయకులు కస్తూరి శ్రీనివాస్‌, రెడ్డప్ప ధవేజీ తదితరులు పాల్గొన్నారు. పీచుపాలెంలో తెలికుల సంక్షేమ సంఘ వనసమారాధన, లక్ష్మణేశ్వరం గ్రామంలో దుర్గా లక్షేణేశ్వరస్వామి ఆలయం ప్రాంగణం వద్ద శెట్టి, బలిజ వనసమారాధన నిర్వహించారు. మొగల్తూరు మండలం మొగల్తూరు ఆర్యవైశ్య సంఘం, గౌడ సమాఖ్యలు వన సమారాధనలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆద్వర్యంలో సంకావారితోటలోనూ, గౌడ సమాఖ్య ఆధ్వర్యంలో కాసానివారిపేట తోటలోనూ నిర్వహించారు. మొగల్తూరు ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌ వర్క్‌ అధినేత కాసాని కృష్ణ మాట్లాడుతూ నేటి కాలంలో ఉద్యోగాలకు కొదవ లేదని క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు.

ఆకివీడు : ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్య వైశ్య కల్యాణ మందిరంలో కార్తీక సమారాధన నిర్వహించారు. సన్నిధి నారాయణ, బొండాడ రాధాకృష్ణ, చక్కా అజయ్‌కుమార్‌, పువ్వాడ రామలక్ష్మణకుమార్‌, బింగుమళ్ళ రమేష్‌, సమయమంతుల కిరణ్‌కుమార్‌, ఓలేటి రవికుమార్‌, శ్రీకాకుళపు నాగేశ్వరరావు తదితర దంపతులు సత్యనారాయణస్వామి వ్రతం, పూజలు నిర్వహించి, మహిళలకు పసుపు కుంకుమ అందించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గొంట్లా గణపతి, గుర్రం శ్రీనివాసరావు, రాజా, ఈశ్వరరావు ఉన్నారు.

ఆచంట/పోడూరు : ఆచంట మండలం కొడమంచిలిలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన వన సమారాధనలో మాజీ మంత్రి పితాని సత్యనారాయ ణ, టీటీడీ సభ్యులు మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్సీ మల్లుల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కొడమంచిలిలో కాపు సంఘాల ఆధ్వర్యంలో వనసమారాధన జరి గింది. ఆచంట ఏఎంసీ ఆధ్వర్యంలో శెట్టిబలిజ వర్తక సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన జరిగింది. పోడూరు మండలం జిన్నూరులో శ్రీకృష్ణ దేవరాయ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కాపు వనసమారా ధనలో ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడారు. మాజీ ఎంపీ చేగొండి హరిరా మ జోగయ్య మాట్లాడుతూ కాపు సంఘీయులు ఐక్యతతో రాణించాలన్నారు.

యలమంచిలి : కాకతీయ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యలమంచిలిలో నిర్వహించిన కార్తీక వన సమారాధన సందడిగా జరిగింది. తొలుత ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళలకు పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. సహపంక్తి భోజనాలు చేశారు.

తాడేపల్లిగూడెం రూరల్‌ : తాడేపల్లిగూడెంలోని కొండాలమ్మ ఆలయ సమీపంలో క్షత్రియ వనసమారాధన జరిగింది. ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరం గనాథరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చెస్‌ అకాడమీ జిల్లా చైర్మన్‌ సీహెచ్‌ఏఆర్‌కే వర్మ, పేరిచర్ల ఫౌండేషన్‌ అధ్యక్షుడు మురళీకృష్ణంరాజు తదిత రులు పాల్గొన్నారు. పెదతాడేపల్లి కమ్మ కల్యాణ మండపంలో తాడేపల్లిగూడెం ఏరియా కమ్మ వనసమారాధన ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు కొండ్రెడ్డి శశికుమార్‌, ప్రధాన కార్యదర్శి గన్నమని శ్రీనివాస్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - 2023-12-04T00:13:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising