జీలుగుమిల్లి ఎన్‌హెచ్ 365 విస్తరణ
ABN, Publish Date - Dec 23 , 2023 | 12:39 AM
జీలుగుమిల్లి వయా బుట్టాయగూడెం, పట్టిసీమ వెళ్లే జాతీయ రహదారి 365 బీబీ రోడ్డు విస్తరణ పనులు జరుగ నున్నాయి.సుమారు 85 కిలోమీటర్ల మేర పనులు చేసేందుకు రంగం సిద్ధ్దమైంది.
రహదారిపై మార్కింగ్‌తో స్థానికుల్లో ఆందోళన
జీలుగుమిల్లి, డిసెంబరు 22 : జీలుగుమిల్లి వయా బుట్టాయగూడెం, పట్టిసీమ వెళ్లే జాతీయ రహదారి 365 బీబీ రోడ్డు విస్తరణ పనులు జరుగ నున్నాయి.సుమారు 85 కిలోమీటర్ల మేర పనులు చేసేందుకు రంగం సిద్ధ్దమైంది. శుక్రవారం హైవే అధికారి కాజా, రెవెన్యూ సిబ్బంది కలసి తెలం గాణ సరిహద్దు ప్రాంతం వద్ద సర్వే జరిపి మార్కింగ్ వేశారు. ప్రస్తుతం రహదారికి ఇరువైపులా ఉన్న ఇళ్లు పలు దుకాణాలు కొంత మేరకు రోడ్డు విస్తరణలో ఖాళీ చెయ్యాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇది మూడో దఫా సర్వే అని అధికారులు చెబుతున్నారు. గ్రామసభ నిర్వ హించిన తర్వాతే చర్యలు చేపడతారన్నారు. స్థానికులు మాత్రం పొంతన లేని సర్వే పనులతో సతమతం అవుతున్నారు. జీలుగుమిల్లి నాల్గు రోడ్ల కూడలి జగదాంబ సెంటరులో రింగ్ (రోడ్డు) ఏర్పడుతుందని మరి కొందరు భావిస్తున్నారు. జగదాంబ ఆలయం, సబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ప్రధన రహదారికి ఇరువైపులా ఉండటంతో అధికారులు చేపట్టే సర్వేతో స్థానికులు మల్ల గుల్లాలు పడుతున్నారు.జనవరి నెలఖరులోపు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ రహదారి జీలుగుమిల్లి నుంచి బుట్టాయగూడెం, పట్టిసీమ కొవ్వూరు మీదుగా రాజమండ్రి సుమారు 85 కిలోమీటర్ల మేర రూ.40 కోట్లతో నిర్మిస్తారని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలిపేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ఎన్‌హెచ్ అసిస్టెంట్ ఇంజనీర్ మధు,వీఆర్వో మాధురి, సర్వేయర్లు రెడ్డి, అబ్రరార్ ఉన్నారు.
Updated Date - Dec 23 , 2023 | 12:39 AM