150 మంది వైసీపీ నేతలకు టీడీపీ తీర్థం
ABN, Publish Date - Dec 28 , 2023 | 12:21 AM
వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.
తణుకు, డిసెంబరు 27: వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులోని తన నివాసంలో బుధవారం నియోజకవర్గంలో పలు గ్రామాలకు చెందిన 150 మంది వైసీపీ నేతలు కార్యక ర్తలు టీడీపీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబుతోనే యువత భవిష్యత్ బాగుంటుందన్నారు. దొమ్మేటి వెంకట సుధాకర్, బసవా రామకృష్ణ, కలగర వెంకటకృష్ణ, గుబ్బల శ్రీనివాసు, సానబోయిన రామకృష్ణ, కాకిలేటి హరినాథ్, జహంగీర్ బాషా, ఆనాల ఆదినారాయణ, పూతినీడి శ్రీనివాసు, అల్లూరి దనరాజు, శీతల శ్రీను చేరారు, కడియాల సూర్యనారాయణ, మట్టా వెంకట్, తాతపూడి మారుతీరావు, ఓమ్మి రాంబాబు పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2023 | 12:21 AM