ఆమెపై అనుమానం పెంచుకుని..
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:58 PM
ఆమెతో పదేళ్లుగా సహజీవనం చేసి మూడు వారాల క్రితం మనస్పర్థలతో విడిపోయిన తరువాత ఆమెపై కక్షగట్టి కత్తితో హత్యాయత్నానికి పాల్పడి ఆపై తాను పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కత్తితో దాడి చేసి.. ఆపై పురుగుల మందు తాగేశాడు
ఏలూరు క్రైం/ఉంగుటూరు, డిసెంబరు 17 : ఆమెతో పదేళ్లుగా సహజీవనం చేసి మూడు వారాల క్రితం మనస్పర్థలతో విడిపోయిన తరువాత ఆమెపై కక్షగట్టి కత్తితో హత్యాయత్నానికి పాల్పడి ఆపై తాను పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితులు పోలీసులకు తెలిపిన వివరాలివి.. ఉంగుటూరు మండలం నారాయణపురంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన ధనికొండ వరలక్ష్మి(45)కు పదేళ్ళ క్రితం ఆమె భర్త మరణించాడు. ఆమెకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నాడు. చేబ్రోలులోని ఇంందిరా కాలనీకి చెందిన బోడిగడ్డ భీమయ్య అలియాస్ భీముడు (60) పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. వరలక్ష్మి కుమార్తెకు వివాహమైంది. కుమారుడు గల్ఫ్ వెళ్లాడు. మూడు వారాల క్రితం వరలక్ష్మికి, భీమయ్యకు మనస్పర్థలు రావడంతో ఆమె ఇంటి నుంచి వచ్చేసి వేరుగా ఉంటున్నాడు. ఆమెపై అనుమానం పెంచుకుని హతమార్చి తాను ఆత్మహత్య చేసుకోవాలని ముందుగా నిర్ణయించుకుని ఆదివారం ఉదయం పొలం పనిలో ఉన్న ఆమె వద్దకు వెళ్లి కత్తితో మెడపై నరికాడు. అక్కడ ఉన్న వారు అతడిని అడ్డగించడానికి ప్రయత్నించగా వారిని బెదిరించి వచ్చి పురుగు మందు తాగేశాడు. ప్రస్తుతం ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా, మెరుగైన వైద్యం కోసం ఆమెను గుంటూరు తరలించారు. భీమయ్య ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ రెండు ఘటనలపై ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్సీగా నమోదు చేసి ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారి ఇద్దరి నుంచి వాంగ్మూలం నమోదు చేసి చేబ్రోలు పోలీసులకు తెలియజేశారు.
Updated Date - Dec 17 , 2023 | 11:58 PM