ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీలో అంతర్మథనం

ABN, First Publish Date - 2023-12-04T00:22:43+05:30

తెలంగాణ ఫలితాలతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్మథనం ప్రారంభ మైంది. తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో ఇక్క్డడ ప్రజలనాడి ఎటువైపు ఉంటుందోనన్న గుబులు అధికార పార్టీలో నెలకొంది.

భీమవరంలో రేవంత్‌రెడ్డి వియ్యంకుడి నివాసం వద్ద బాణసంచా కాల్పులు

వెంటాడుతున్న ఓటమి భయం

తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం

స్థానికంగా కాంగ్రెస్‌ విజయోత్సవాలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తెలంగాణ ఫలితాలతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్మథనం ప్రారంభ మైంది. తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో ఇక్క్డడ ప్రజలనాడి ఎటువైపు ఉంటుందోనన్న గుబులు అధికార పార్టీలో నెలకొంది. ఇప్పటిదాకా సంక్షేమ పథకాలు తమను అదుకుంటా యంటూ జిల్లాలో ఆ పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వస్తున్నారు. తెలంగాణలోనూ సంక్షేమ పథకాలు అమ లుకు నోచుకున్నాయి. అయినా అక్కడ అధికార భారతీయ రాష్ట్ర సమితికి (బీఆర్‌ఎస్‌) చేదు అనుభవం ఎదురైంది. అక్కడ పరిపాలరా విధానం కూడా ఓటమి కారణమంటూ విశ్లేషణలు జోరందు కున్నాయి. అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంది. వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పోకడలతో పాలన సాగిస్తోంది. ప్రశ్నించే వారిపై కేసులు నమోదవుతున్నాయి. సమస్యలపై గొంతు విప్పే పరిస్థితి లేదు. ఇప్పటికే ప్రతిపక్షాలపై ఇబ్బడి ముబ్బడిగా కేసులు నమోదు చేశారు. ఉద్యోగుల గొంతు నొక్కారు. రాజకీయ కక్ష లు రాజ్యమేలుతున్నాయి. కేవలం సంక్షేమ పథకాలు అమలుపైనే ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది. అభివృద్ధిపై ధ్యాస లేదు.ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదన్న భావన అన్ని వర్గాల్లోనూ నెలకొంది. మరోవైపు తెలుగుదేశం, జనసేన పొత్తు ప్రభావం అధికంగానే ఉంటుంది. ఇవన్నీ అధికార పార్టీ నేతలను కలవర పెడుతున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం జిల్లాలో ఏకపక్ష విజయమేనంటూ ధీమాతో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తెలం గాణ ఫలితాలు ఇక్కడ చర్చకు దారితీశాయి.వైసీపీ ప్రభుత్వానికి ఎదురీత తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈసారి జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ బతుకు ఉండదన్న వ్యాఖ్యలు జనంలో సాధారణ మైపోయాయి. వైసీపీ నేతలు మాత్రం వై ఏపీ నీడ్స్‌ జగన్‌, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తు న్నారు.ప్రభుత్వ ఉద్యోగులను, వలంటీర్లను ఇందుకోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వం పేరుతో పార్టీని ప్రచారం చేసుకుంటున్నారు.ఈ తరుణంలో తెలంగాణ ఫలితాలు ఇక్కడ అధికార పార్టీని కలవర పెడుతు న్నాయి. మరోవైపు జిల్లాలో అంతగా ప్రభావం లేని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆయా రాష్ర్టాల్లో విజయంపై సంబరాలు చేసుకున్నాయి. మూడు రాష్ర్టాల్లో విజయం సాధించామని బీజేపీ, తెలంగాణలో గెలుపొందామని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి.

జిల్లాలో కాంగ్రెస్‌ విజయోత్సవాలు

ఆకివీడు రూరల్‌ /ఉండి /తాడేపల్లిగూడెం రూరల్‌/ గణపవరం, డిసెంబరు 3 : ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్‌ పార్టీ అత్యవసరమని సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయ కుడు మాజీ ఎంపీ కనుమూరు బాపిరాజు అన్నారు. ఆకివీడు మండలం అయిభీమవరంలో తన నివాసం వద్ద కార్యకర్తలు నాయకులతో కలిసి బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంపిణీ చేశారు. ఈదేశానికి కాంగ్రెస్‌ అవసరం ఎంతైనా ఉందన్నారు. నాయకులు విడిపోతేనే ఇతర పార్టీలకు అవకాశం వస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చావు లేదన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి వేగేశ్న వెంకట గోపాల కృష్ణంరాజు, సీతారామ్‌, గంగరాజు, ఆదిశేషు, జెఎస్‌ఆర్‌, కొల్లు సత్యశ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఉండిలో నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి వేగేశ్న గోపాల కృష్ణంరాజు ఆధ్వర్యంలో స్వీట్లు పంచారు. జంపన సుబ్రహ్మణ్యంరాజు, అడబాల శ్రీను, గంగయ్య, అప్పల రాజు, నాగకేశవ బాబు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మార్నీడి బాబ్జి ఆధ్వర్యంలో ఆదివారం తాడేపల్లిగూడెంలో సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచి బాణాసంచా కాల్చారు. బాలబొమ్మల శ్రీనివాస్‌, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాతపాటి హరికుమార్‌రాజు అన్నారు. ఆదివారం విజయవాడలో ఆంధ్రరత్న భవనంలో పార్టీ విజయోత్సవాల్లో పాల్గొన్నట్టు తెలిపారు. ఇదే స్పూర్తితో వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

రేవంత్‌ రెడ్డి వియ్యంకుడి ఇంటి వద్ద సంబరాలు

భీమవరం టౌన్‌, డిసెంబరు 3 : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన రేవంత్‌రెడ్డి విజయం సాధించడంతో భీమవరంలో ఆయన అభిమానులు, బంధువులు సంబరాలు చేశారు. 2015లో రేవంత్‌రెడ్డి కుమార్తెను భీమవరానికి చెందిన గొలుగూరి వెంకటరెడ్డి కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. అప్పట్లో రేవంత్‌ రెడ్డి భీమవరం వచ్చి రెండు రోజులు బస చేశారు. తర్వాత సంక్రాంతి పండుగకు వచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్య తలు చేపడతారన్న వార్తల నేపథ్యంలో ఆయన వియ్యంకుడు వెంకటరెడ్డి ఇంటివద్ద బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంపిణీ చేశారు. తెలంగాణ ఫలితాలపై ఆదివారం ఉదయం నుంచి ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు.

Updated Date - 2023-12-04T00:22:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising