ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ధాన్యం మిల్లులకు తరలించండి

ABN, First Publish Date - 2023-12-04T00:16:07+05:30

కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఆర్‌బీకేల ద్వారా రైస్‌మిల్లులకు తరలించాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులకు, రైతులకు కలెక్టర్‌ ప్రశాంతి ఆదేశించారు. పాలకొల్లు రూరల్‌ మండలంలోని శివదేవుని చిక్కాలలో ధాన్యం కళ్లాలను, రాశులను ఆమె ఆదివారం పరిశీలించారు.

పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలలో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంతి

అధికారులకు, రైతులకు కలెక్టర్‌ ఆదేశం

పాలకొల్లు రూరల్‌, డిసెంబరు, 3 : కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఆర్‌బీకేల ద్వారా రైస్‌మిల్లులకు తరలించాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులకు, రైతులకు కలెక్టర్‌ ప్రశాంతి ఆదేశించారు. పాలకొల్లు రూరల్‌ మండలంలోని శివదేవుని చిక్కాలలో ధాన్యం కళ్లాలను, రాశులను ఆమె ఆదివారం పరిశీలించారు.తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు వరికోతలు వాయిదా వేసుకోవాలన్నారు. ఇప్పటికే మాసూళ్లు చేసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోవాలని సూచించారు. ప్రజలను సురక్షిత పునరా వాసాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్‌ పెద్దిరాజు, ఎంపీడీవో కె.వెంక టేశ్వరరావు, ఏవో శామ్యూల్‌ జాన్సన్‌ తదితరులు ఉన్నారు.

నచ్చిన మిల్లుకు తరలించుకోవచ్చు: జేసీ

పాలకోడేరు/పెంటపాడు : రైతులు తమ సొంతవాహనాలను జీపీఎస్‌ లేకపోయినా ఉపయోగించుకోవచ్చునని ఆఫ్‌లైన్‌ ద్వారా కూడా ధాన్యం అమ్మ కాలు జరుపుకోవచ్చునని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రామ్‌సుందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పాలకోడేరు మండలం కొరుకొల్లులో ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడారు. అధికారులు క్షేత్రస్థాయిలోనే మకాం వేయాలని ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ధాన్యం సురక్షిత ప్రాంతాలలో ఆరబెట్టుకొని వెనుబెంటనే రైతు భరోసాల కేంద్రాల ద్వారా రైస్‌ మిల్లులకు తరలించాలన్నారు. తహసీల్దార్‌ షేక్‌హుస్సేన్‌, వ్యవసాయశాఖ అధికారి నారాయణరావు, పాల్గొన్నారు. పెంటపాడులోని వరి మాసూళ్ల పనిలో ఉన్న రైతులతో జేసీ మాట్లాడారు. వరికోతలు మరో మూడు రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు. తహసీల్దార్‌ జీవి శేషగిరిరావు ఉన్నారు.

మిల్లర్లు ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాలి : ఆర్డీవో

పోడూరు : రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు ఎప్పటి కప్పుడు దిగుమతి చేసుకోవాలని నరసాపురం ఆర్డీవో అంబరీష్‌ మిల్లర్లుకు సూచించారు. ఆదివారం పోడూరు మండలంలోని జిన్నూరు, మట్టపర్రు గ్రామాల్లోని రైస్‌ మిల్లులను ఆయన సందర్శించారు. ధాన్యం తీసుకొచ్చిన ట్రాక్టర్లు ఎక్కువుగా ఉండటంలో దిగుమతి చేయించి క్లియర్‌ చేయించారు. తహసీల్దార్‌ కృష్ణారావు, ఏవో సత్యనారాయణ, ఆర్‌ఐ రాంబాబు ఉన్నారు. పెను గొండ మండలం వడలి గ్రామంలో రైతులను కలిసి పలు సూచనలు చేశారు.

అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

భీమవరం డిసెంబరు 3 : తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి హెచ్చరించారు. ఆది వారం మిచౌంగ్‌ తుఫాన్‌పై జిల్లా అధికారులకు పలు సూచ నలు చేశారు. జిల్లా, డివిజన్‌ కేంద్రాలలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఆదివారం నుంచి నాలుగురోజులు పాటు మత్స్యకారులు వేటకు వెళ్ల వద్దని హెచ్చరించారు. తీరప్రాంతాలకు వెళ్లే దారులను మూసి వెయ్యాలని ఆదేశించారు. పునరా వాస కేంద్రాలలో అన్ని వసతులు కల్పించే బాధ్యత పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాల న్నారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చితే ప్రజలు బయటకు రావద్దన్నారు. అవసరాన్ని బట్టి 144 సెక్షన్‌ విధి స్తామని తెలిపారు. నర్సాపురం, మొగ ల్తూరు హైవేలో రాకపోకలను నిలుపుదల చేస్తామని తెలిపారు. ఈ రెండు మండలాలలో తుఫాను తీవ్రతను బట్టి ఎన్‌డీ ఆర్‌ఎఫ్‌ టీమ్‌లు, గజ ఈతగాళ్ళను సిద్ధ్దంగా ఉంచామ న్నారు. తుఫాను వెళ్ళే వరకు సెలవులు రద్దు చేసినట్టు తెలిపారు.మొగల్తూరు, నర్సాపురంతో పాటు, యలమంచిలి, ఆచంట మండలాల్లోని ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలన్నారు.

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

కంట్రోల్‌ రూమ్‌ను జిల్లా కలెక్టర్‌ ఆదివారంరాత్రి ఆకస్మికంగా సందర్శించారు. తుఫాన్‌ అత్యవసర సాయం కోసం కంట్రోల్‌ రూమ్‌ నెంబరు 088162 99219ను అందుబాటులోకి తీసుకువచ్చారు. తుఫాన్‌ తీరం దాటే వరకు కంట్రోల్‌రూమ్‌ విధులలో చాలా అప్రమత్తంగా నిర్వహించాలని సూచించారు.

నేడు స్పందన రద్దు

తుఫాన్‌ కారణంగా సోమవారం జరగాల్సిన జిల్లాస్ధాయి స్పందన కార్యక్రమాన్ని రద్దుచేసినట్లు కలెక్టర్‌ ప్రకటిం చారు. తుఫాన్‌ హెచ్చరికలును పాటిస్తూ ఇంటి వద్దనే ఉండాని జిల్లా కేంద్రానికి ప్రజలు రావద్దని కోరారు.

Updated Date - 2023-12-04T00:16:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising