ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మాద్యమాన్ని ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థికే ఇవ్వాలి

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:56 PM

విద్యార్థులకే తెలుగు లేక ఆంగ్లం మాద్యమాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ప్రభుత్వం ఇవ్వాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల డిమాండ్‌ చేశారు.

నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న మంజుల తదితరులు

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల డిమాండ్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 17 : విద్యార్థులకే తెలుగు లేక ఆంగ్లం మాద్యమాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ప్రభుత్వం ఇవ్వాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల డిమాండ్‌ చేశారు. ఆదివారం ఏలూరులోని ఏపీ ఎన్జీవో హోం జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆమె మాట్లాడుతూ జీవో 117 కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ప్రభుత్వ పాఠశా లలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయని, మరో 6 వేల పాఠశాలలు మూత పడ్డాయని ఆరోపించారు. పాఠశాలవిద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ జిల్లాల్లో స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీలు చేయడానికేతప్ప విద్యారంగ అభివృద్ధికి దోహదప డేలా లేవని విమర్శించారు. అనంతరం సంఘ రాష్ట్ర కార్యదర్శి బి.ఏ.సాల్మన్‌రాజు, సంఘ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్‌ మాట్లాడారు.

ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా రామారావు ఎన్నిక

ఏపీటీఎఫ్‌ ఏలూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా టి.రామారావు, ప్రధాన కార్యదర్శిగా బి.రెడ్డిదొర, ఉపాధ్యక్షులుగా బి.శ్యాంసుందర్‌, ఎన్‌.జె.పి.నారాయణ, ఎస్‌,దొరబాబు, కె.ఎన్‌.రమాదేవి ఎన్నిక య్యారు. కార్యదర్శులుగా యు.వి.నరసింహరాజు, జె.సోమేశ్వరశాస్త్రి, వి.గణేష్‌, పి.వి.ఆర్‌.రాజ్యలక్ష్మి, డి.కె.ఎస్‌.ఎస్‌.ప్రకాష్‌రావు, రాష్ట్ర కౌన్సిలర్లుగా కె.కుటుంబరావు, ఎన్‌.భాస్కర్‌వర్మ, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా టి.ప్రకాశ్‌, కో–కన్వీనర్లుగా పి.జగదీశ్వ రరావు, టి.నారాయణరావులను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంతో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల ప్రమాణస్వీకారం చేయించారు.

Updated Date - Dec 17 , 2023 | 11:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising