సడలని సమ్మె
ABN, Publish Date - Dec 14 , 2023 | 11:53 PM
అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేపట్టిన సమ్మె నిరాటంకంగా సాగుతోంది. మండల కేంద్రాల్లో చేపట్టిన నిరసన దీక్షలు గురువారం మూడో రోజు కొనసాగాయి. టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు దీక్ష శిబిరాలను సందర్శించి మద్దతు తెలిపారు.
మూడో రోజు కొనసాగిన అంగన్‌వాడీల దీక్ష
రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు
అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేపట్టిన సమ్మె నిరాటంకంగా సాగుతోంది. మండల కేంద్రాల్లో చేపట్టిన నిరసన దీక్షలు గురువారం మూడో రోజు కొనసాగాయి. టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు దీక్ష శిబిరాలను సందర్శించి మద్దతు తెలిపారు. సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
అంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్: పెదపాడులో అంగన్‌వాడీ కార్యకర్తలు నోట్లో పచ్చగడ్డి పెట్టుకుని వినూత్న రీతిలో నిరసను తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బస్టాండ్ సెంటర్‌లో చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. సీపీఎం, ఏపీ రైతు సంఘం, ఆవాజ్ నాయకులు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. దెందులూరులో అంగన్వాడీల నిరసన శిబిరాన్ని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి ఘంటసాల వెంకటలక్ష్మి సందర్శించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలు, ఉద్యోగుల ను ఇబ్బందులకు గురి చేస్తుందని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలన్నారు. బుట్టాయగూడెంలో అంగన్‌వాడీల సమ్మెకు టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాస్, యూ టీఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు. మొగపర్తి సోంబాబు, పారేపల్లి రామారావు, యంట్రప్రగడ శ్రీనివాసరావు, తెల్లం రామకృష్ణ, ఎం.నాగమణి, రామలక్ష్మి, పుష్ప, కృపామణి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆర్డీవో అద్దయ్యకు అంగన్‌వాడీ వర్కర్లు వినతిపత్రం అందజేశారు.
కొయ్యలగూడెంలో జరిగిన దీక్షలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ మొండి వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మొడియం నాగమణి, శ్రీదేవి, నూర్జహాన్, తదితరులు ఉన్నారు. ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉధృతం కాకముందే విరమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరంలో అంగన్ వాడీల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుడు మంగిన కొండ మాట్లాడుతూ మండలంలో 85 అంగన్వాడీ సెంటర్లు మూతపడడంతో మూడు రోజు లుగా 4వేల మంది శిశువులు, 500 మంది గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం అందక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చింతలపూడి ఫైర్‌స్టేషన్ సెంట ర్‌లో అంగన్‌వాడీల శిబిరాన్ని సందర్శించిన టీడీపీ నాయకులు జె.ముత్తారెడ్డి, పక్కాల వెంకటేశ్వరరావు, కోండ్రు దేవ, జనసేన నాయకులు చీదరాల మధుబాబు, సునీత, రమేష్, కృష్ణారావు, చెన్నకేశవరాజు సంఘీభావం తెలిపారు. అంగన్‌వాడీలు మోకా ళ్లపై నిలబడి నిరసన తెలిపారు. మాజీ ఐఎఎస్ అధికారి విజయకుమార్ సంఘీ భావం తెలిపారు. టి.నరసాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన శిబిరాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు నాయుడు రామకృష్ణారావు గౌడ్ సందర్శించారు. ఆచంట అనిల్ కుమార్, పెద్దిన చంద్రశేఖర్, కాసన్నేని మాధవరావు, గంధం ముత్తయ్య, పాపాచా ర్యులు వీరేశలింగం, దాసరి చంద్రశేఖర్, కొక్కిరిగడ్డ బాలస్వామి, మారు మూడి పుణ్యేశ్వరరావు, పలగాని మురళీకృష్ణ, సీపీఎం మండల నాయకులు అనుమోలు మురళి తదితరులు పాల్గొన్నారు. పెదవేగిలో అంగన్‌వాడీల శిబిరం వద్ద సీఐటీయూ జిల్లా నాయకురాలు పి.హైమావతి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైంది జగనన్నా అని ప్రశ్నించారు. అంగ న్‌వాడీల సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆమె మండి పడ్డారు. ఆనాడు పాదయాత్ర సమయంలో అంగన్‌వాడీలపై ఎక్కడలేని ప్రేమ చూపించారని, తెలంగాణలో ఇచ్చే జీతాలకంటే కనీసం ఒక్క వెయ్యి అయినా ఎక్కువ ఇస్తానని హామీ ఇచ్చారని ఆమె చెప్పారు. అధికారంలోకి వచ్చి నాలుగున్న రేళ్లు దాటినా ఇంతవరకు ఆ ఊసే ఎత్తలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. సీఐటీయూ మండల అధ్యక్షుడు పి.ప్రసాద్, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూ నియన్ నాయకులు వి.బేబీరాణి, ఎం.కృష్ణవేణి, ఎం.త్రివేణి, ఏ.భార్గవి, సూర్యకుమారి, లావణ్య, నిర్మల, యశోద, దుర్గ, శ్రావణి, నాగమణి తదిత రులు పాల్గొన్నారు. లింగపాలెంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల నిరసన దీక్షకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు ప్రకటించింది. సమస్యలు పరిష్కరించాలని జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణను డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ సంఘం నాయకులు బీజేఎన్ కుమారి, ఈశ్వరి, మేరీ, పలువురు కార్యకర్తలు, హెల్ప ర్లు పాల్గొన్నారు. నిడమర్రులో అంగన్‌వాడీలకు జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పత్సమట్ల ధర్మరాజు, కాంగ్రెస్ నాయకులు పాతపాటి హరికుమార్ రాజు సీఐటీ యూ నాయకులు నారపల్లి రమణారావు మద్దతు తెలిపారు. ఓగిరాల విమల, ఆర్. రామలక్ష్మి, ఎన్.నాగేశ్వరి, బి.కుమారి, ఎ.నాగమణి తదితరులు పాల్గొన్నారు. భీమడో లులో అంగన్‌వాడీల శిబిరంలో జనసేన నేత ధర్మరాజు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడం, నిర్భంధించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రత్తి మదన్, తదితరులు పాల్గొన్నారు. కుక్కునూరులో అంగన్‌వాడీలకు టీడీపీ మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వర రావు, యుటీఎఫ్ మండల నాయకులు మద్దతు తెలిపారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారితో కలసి పోరాటం చేస్తామన్నారు. కోటగిరి సత్యనారా యణ, పిచుక రాజు, కమల్‌కుమార్, బాలకృష్ణ, వై.సాయికిరణ్ తదితరులు పాల్గొ న్నారు. జంగారెడ్డిగూడెంలో అంగన్‌వాడీల శిబిరాన్ని సందర్శించిన టీడీపి రాష్ట్ర అధి కార ప్రతినిధి దాసరి శ్యాం చంద్ర శేషు, బొమ్మాజీ అనిల్ మద్దతు తెలిపారు. సమ స్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను బలవం తంగా తెరిపించడం దుర్మార్గం అన్నారు. సామరస్యంగా సమస్యను పరిష్కరించా ల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, కొండ్రెడ్డి కిషోర్, కొంచాడ ప్రసాద్, ఆలపాటి నాని, చెరుకూరి శ్రీధర్, ముళ్ళపూడి శ్రీనివాస్, గణేష్, కిరణ్, తోట కృపావరం, పులపకుల ప్రసాద్ తదితరులు అంగన్‌వాడీ కార్యకర్తలకు మద్దతుగా నిలిచారు.
Updated Date - Dec 14 , 2023 | 11:53 PM