ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉద్యమం ఉధృతం చేస్తాం

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:58 PM

అంగన్‌వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.లింగరాజు అన్నారు. ఉద్యమం ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ వర్కర్లు స్పష్టం చేశారు.

జంగారెడ్డిగూడెంలో అంగన్‌వాడీల మానవహారం

కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె

జంగారెడ్డిగూడెం టౌన్‌, డిసెంబరు 18: అంగన్‌వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.లింగరాజు అన్నారు. ఉద్యమం ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ వర్కర్లు స్పష్టం చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం చేపట్టిన ధర్నా కార్యక్రమానికి పది మండలాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు. మసీదు సెంటర్‌ నందు మానవహారం ఏర్పడి సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. లింగరాజు, అంగన్వాడి యూని యన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు విమల, ఏఐటీయూసీ నాయకులు బుచ్చిబాబు, ఐఎఫ్‌టీయూ నాయకులు రామ్మోహన్‌రావు, సీపీఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం, సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగమణి మాట్లాడారు. ప్రభుత్వాలు అంగన్వాడి వర్కర్ల శ్రమను దోచుకుంటున్నాయన్నారు. అంగన్‌ వాడీ కేంద్రాల తాళాలు బద్దలుకొట్టి కక్ష సాధింపులు చేస్తున్నాన్నారు. ఈ కార్యక్రమంలో షేక్‌ సుభాషిణి, పటాన్‌ మస్తాన్‌, పసల సూర్యరావు, టీపీఎస్‌ రాజు, పీఎల్‌ఎస్‌ కుమారి తులసి, పుష్పరాజ్యం, లక్ష్మీదేవి పాల్గొన్నారు.

పోలవరం: పోలవరంలో అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె కార్యక్ర మం సోమవారం ఏడో రోజుకు చేరింది. అంగన్వాడీలు సమ్మె శిబిరం వద్ద కళ్లు, నోరు, చెవులు మూసుకుని నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల కోర్కె లు తీర్చాలంటూ నినాదాలు చేశారు. అనంతరం జంగారెడ్డిగూడెం ఆర్డీవో కా ర్యాలయ ముట్టడి కార్యక్రమానికి తరలివెళ్లారు. అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ మండల కార్యదర్శి పిఎల్‌ఎస్‌ కుమారి, హైమావతి, సీత, కుబ్ర, జుబేదా, గుత్తుల విజయ , సిరుగుడు దుర్గ తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీలకు టీడీపీ జనసేన అండగా ఉంటాయని టీడీపీ వాణిజ్య విభాగ అధ్యక్షుడు గుబ్బా రాంబాబు అన్నారు. ఎల్‌ఎన్‌డీ.పేటలో అంగన్వా డీల తాళాలు బద్దలుకొడుతున్న అధికారుల వద్ద టీడీపీ జనసేన నాయకులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అంగన్వాడీలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇళ్ళ సత్యనారాయణ, చిక్కాల వెంకటేష్‌, తేలె నరసింహ మూర్తి, కట్టా నరేష్‌ బాబు, పులిబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఉంగుటూరు: మండలంలో అంగన్‌వాడీ వర్కర్ల ఆందోళన కొనసా గుతోంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పలు గ్రామాలలో అంగన్‌వాడీ కేంద్రాలు తెలిచారు. ఎంపీడీవో వీఆర్వో, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లు పలు గ్రామాలలో అంగన్వాడీలను తెరచినట్లు ఎంపీడీవో నందిపాటి ప్రేమాన్విత తెలిపారు.

చింతలపూడి: అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. సమస్యలు పరిష్కరించాలని, నమ్మించి మోసం చేయవద్దని, కక్ష సాధింపు వద్దని నిరసన దీక్షా శిబిరంలో అంగన్‌వాడీ కార్యకర్తలు నినాదాలు చేశారు. సుమారు 100 మంది కార్యకర్తలు నూజివీడు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమానికి తరలివెళ్ళారు. అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూని యన్‌ నాయకులు మాణిక్యం, సరళ, కవిత మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Updated Date - Dec 18 , 2023 | 11:58 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising