నోటికి తాళం
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:05 AM
వెట్టి చాకిరి చేస్తూ నోరు మెదపలేని దుస్థితిలో అంగన్‌వాడీలున్నారని అంగన్‌వాడీ యూనియన్ నాయకురాలు విజయలక్ష్మి అన్నారు. అంగన్‌వాడీల సమ్మెలో భాగంగా మండలంలో శనివారం నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
నల్ల రిబ్బన్ కట్టుకుని అంగన్‌వాడీల నిరసన
పెదవేగి, డిసెంబరు 16: వెట్టి చాకిరి చేస్తూ నోరు మెదపలేని దుస్థితిలో అంగన్‌వాడీలున్నారని అంగన్‌వాడీ యూనియన్ నాయకురాలు విజయలక్ష్మి అన్నారు. అంగన్‌వాడీల సమ్మెలో భాగంగా మండలంలో శనివారం నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. విజయలక్ష్మి మాట్లాడుతూ చిన్నారుల సంరక్షణ దగ్గరనుంచి గర్భవతులు, బాలింతలకు నిత్యం ఎన్నో జాగ్రత్తలు చెప్పే అంగన్‌వాడీలు తమ సమస్యలను చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్య లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలో చేపట్టిన తరువాత అంగన్‌వాడీల సమస్యలను మర్చిపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించి, మౌనం పాటించారు. సీఐటీయూ మండల అధ్యక్షుడు పి.ప్రసాద్, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు బేబీరాణి, కృష్ణవేణి, నిర్మల, త్రివేణి, భార్గవి, సూర్యకుమారి, లావణ్య, యశోద, శ్రావణి, నాగమణి, ఉష, సరోజిని, సుజాత, చిరంజీవి కుమారి తదితరులు పాల్గొన్నారు.
దెందులూరు: వైసీపీ ప్రభుత్వం కావాలని అంగన్‌వాడీ వర్కర్లను రెచ్చగొడుతుందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. దెందు లూరులో అంగన్‌వాడీల ఆందోళనకు ఆయన మద్దతు పలికారు. ప్రభుత్వం దొంగల కంటే దారుణంగా అంగన్వాడీ కేంద్రాల తాళలను పగుల కొట్టవల సిన అవసరం ఎందుకు వచ్చిందో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. అంగన్వా డీలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలన్నారు. సర్పంచ్ తోట ఏసమ్మ, ఎంపీటీసీ పెనుబోయిన శేషారత్నం, యిప్పిలి వెంకటేశ్వరావు, గార పాటి కొండయ్య చౌదరి, అంగన్వాడీ యూనియాన్ నాయకులు రంగమ్మ, జ్యోతి, నాగలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం: అంగనవాడీల సమస్యలు పరిష్కరించాలని రాజకీ య, ప్రజాసంఘాల నాయకులు కారం రాఘవ, ఈ.భూషణం, వి.భారతి, రవిప్రసాద్, మద్దిపాటి శ్రీనివాస్, తెల్లం రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. ప్రజా సంఘాలు, విద్యార్థి, మహిళా సంఘా లు మద్దతు పలికి సమ్మెలో పాల్గొన్నాయి. ఎం.నాగమణి, ఎస్.రామ్మోహన్, బి.వినోద్, టి.బాబురావు, సర్పంచ్ కారం లక్ష్మీ, ఎంపిటిసి కొవ్వాసు గోవింద రాజు, విఎస్ కృపామణి, కె.పుష్ప, టి.రామలక్ష్మి, కె.మారమ్మ, కె.ఆకాశమ్మ, భూదేవి, రామాయమ్మ తదితరులు పాల్గొన్నారు.
పోలవరం: అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ సమ్మెలో భాగంగా నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మండల కార్యదర్శి పీఎల్‌ఎస్ కుమారి మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మెను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం అధికారులు అంగన్వాడీల తాళాలు బద్దలు కొట్టి వలంటీర్లు, డ్వాక్రా సంఘాల వారితో శిశువులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం ఎంతకాలం పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. తాళాలు బద్దలు కొట్టి స్టాక్ పొజిషన్ లెక్కలు కూడా లేకుండా ప్రభుత్వమే చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తుంటే అంగన్వాడీలకు న్యాయం ఎక్కడ దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్ల సంఘం నాయకులు హైమా వతి, సరస్వతి, చెరుకూరి మణి, జబేద, విజయ, కుబ్ర పాల్గొన్నారు. అంగన్వాడీల సమ్మెతో మండలంలో 85 అంగన్వాడీ సెంటర్లలో పౌష్టికాహారం పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. అధికారులు కొన్ని చోట్ల పౌష్టికాహార పంపిణీకి ప్రయత్నించినా చిన్నారుల తల్లిదండ్రులు తిరస్కరించారు. బెస్తావీది అంగన్వాడీ సెంటర్ భాద్యతలు గర్భవతైన వెటర్నరీ మహిళా సిబ్బంది ఒకరికి అప్పగించగా అంగన్వాడీ సెంటర్‌లో పౌష్టికాహార పెట్టెల తాళాలు రాకపోవడం వలన హోటల్ నుంచి బోజనం తెప్పించి వలంటీర్ ద్వారా వడ్డించారు. మండలంలో 90 శాతం అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం ఐదు రోజులుగా పంపిణీ కావడం లేదు.
జీలుగుమిల్లి : అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోరుతూ ఐదో రోజు తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన ధీక్షల కొనసాగాయి. శిభిరం వద్ద శనివారం ఎమ్మెల్సీ ఎస్‌కె.సాభ్జి చిత్రపటానికి పూల దండలు వేసి కార్యకర్తలు నివాళులర్పించారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసనలు తెలిపారు. సీఐటీయూ మండల కార్యదర్శి సీహెచ్.కొండలరావు, నాయకులు మాట్లాడు తూ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. జ్యోతికుమారి, ఉర్ల మణి, ఎస్తేరు, పూర్ణావతి, కె.సరళకుమారి, పి.అరుణాంబ, కె.వెంకమ్మ, భూలక్ష్మీ వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
లింగపాలెం: సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్‌వాడీలు స్పష్టం చేశారు. అంగన్‌వాడీల యూనియన్ జిల్లా గౌరవాధ్య క్షురాలు కె.విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్‌వాడీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. అంగన్‌వాడీ సెంటర్లకు వేసిన తాళాలను ప్రభుత్వం పగులగొట్టిస్తుందని, అంగన్‌వాడీలపై గూండా యిజం ప్రదర్శిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన షేక్ సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాబ్జీ హక్కులకై పోరా డిన గొప్ప వ్యక్తి అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే.. జగన్‌మోహన్‌రెడ్డి అంగన్‌వాడీలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే ముప్పి డి వెంకటేశ్వరరావు విమర్శించారు. అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడారు. తొలుత ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతికి సంతాపాన్ని ప్రకటించారు. గంటా బాబ్జి, ఏపూరి దాలయ్య, కూరాకుల బుజ్జి, వాసిరెడ్డి ప్రవీణ్‌కుమార్, కొత్తపల్లి సుబ్బారావు, వీరిశెట్టి రామారావు, పొనుకుమాటి శ్రీసంధ్య, బొల్లిన బాబి, కె.గాంధీ తదితరులు పాల్గొన్నారు.
టి.నరసాపురం: అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షుడు అడపా నాగరాజు డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు వారు మద్దతు తెలిపారు. వాసిరెడ్డి మోహనరావు, జోనుబోయిన సోంబాబు, సాయి, అద్దంకి జగ్గారావు, డి.రంగారావు, కోరుకొండ భద్రం, మోదుగు రా మారావు, వేములయ్య, గుర్రం యువరాజు, మధ్యాహ్నపు చిన పెంటారావు, తోట సాయి, ఆళ్ళ బాలాజీ, దాసరి పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.
కొయ్యలగూడెం: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరసన దీక్షలు 5వ రోజు కొనసాగింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమన్నారు. ఎమ్మె ల్సీ సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్.రాం బాబు, నాగవేణి, రత్నకుమారి, పద్మజ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 12:05 AM