ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంగన్‌వాడీల ఆక్రందన

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:28 PM

మేము అధికారంలోకి వస్తే అంగన్‌వాడీ సిబ్బందికి తెలంగాణ కంటే జీతం రూ. 1000 అదనంగా ఇస్తామని 2019లో పాదయాత్ర సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఆయన మాట నమ్మి చాలామంది అంగన్‌వాడీ సిబ్బంది గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికారు.

ముసునూరులో మోకాళ్లపై నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు

నమ్మించి దగా చేసిన సీఎం జగన్‌

సంక్షేమ పథకాలకూ దూరం చేశారు..

సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం..

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీలు

జిల్లా వ్యాప్తంగా ఆరో రోజుకు సమ్మె

ఏలూరు రూరల్‌, డిసెంబరు 17 : మేము అధికారంలోకి వస్తే అంగన్‌వాడీ సిబ్బందికి తెలంగాణ కంటే జీతం రూ. 1000 అదనంగా ఇస్తామని 2019లో పాదయాత్ర సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఆయన మాట నమ్మి చాలామంది అంగన్‌వాడీ సిబ్బంది గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికారు. అయితే గెలిచిన తర్వాత వైసీపీ ప్రభుత్వం తమను దగా చేసిందని అంగన్‌వాడీలు ఆవేదన చెందుతున్నారు. నాలుగున్నరేళ్లుగా వేతనాలు పెంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కంటితుడుపుగా వెయ్యి పెంచి చేతులు దులుపుకుందని తర్వాత సంక్షేమ పథకాలను దూరం చేసిందని మండిపడుతున్నారు. ప్రస్తుతం అంగన్‌వాడీ సిబ్బంది రూ. 11,500 వేతనం అందు కుంటున్నారు. ఈ వేతనం దేనికి సరిపోవడం లేదని కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణలోని అంగన్‌ వాడీల మాదిరిగా రూ. 15 వేలు వేతనం, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ వ స్తాయని ఆశ పడ్డామని ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి ఆరో రోజుకు చేరింది. ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

టీడీపీ హయాంలోనే లబ్ధి

టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే అంగన్‌వాడీ సిబ్బందికి వేతనాలు పెరిగాయి. 2012లో 3,700 జీతానికి అంగన్‌వాడీ కార్యకర్తలు విధుల్లోకి చేరారు. 2014 టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత వారికి రూ.4,200, 2016లో రూ. ఏడు వేలు, 2017లో 10,500లకు వేతనం పెంచింది. సహాయకులకు కూడా జీతాలు పెరిగాయి. టీడీపీ వచ్చిన తర్వాత 2016లో 4,500, 2017లో ఆరు వేలకు వేతనాలు పెంచారు. ప్రభుత్వ పథకాలకు అర్హులుగా అర్హతను బట్టి పఽథకాలు పొందేవారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో లబ్ధి చేకూరింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రూ. 1000 మాత్రమే జీతం పెంచి సంక్షేమ పథకాలకు కోత పెట్టింది.

Updated Date - Dec 17 , 2023 | 11:28 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising