ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అన్నదాత ఆక్రందన

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:08 AM

ఒకవైపు పాలకవర్గం నిర్లక్ష్యం. ఇంకోవైపు ప్రకృతి శాపం.. ఈ రెండూ తోడవడంతో వరి, ఉద్యాన పంట సాగు శాపమైంది. వ్యవ సాయానికి చేయూతనివ్వాల్సిన సహకార బ్యాంకులు ఎప్పుడో కాడిపడేశాయి.

నిండా ముంచిన ప్రకృతి వైపరీత్యాలు

రైతు ప్రభుత్వమంటూనే.. పైసా విదల్చలేదు

పంటల బీమా.. ప్రీమియంకు కాళ్లు

తడిసిన ధాన్యం కొనుగోళ్లకు సవాలక్ష కిరికిర్లు

రైతుకు నష్టం.. దళారీకి లాభం

ఏడాది పొడవునా ఆక్వా ఒడిదుడుకే

కోట్ల రూపాయలు పెట్టుబడి గోవింద

వైసీపీ సర్కార్‌దీ రైతులతో దోబూచులాట

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

ఒకవైపు పాలకవర్గం నిర్లక్ష్యం. ఇంకోవైపు ప్రకృతి శాపం.. ఈ రెండూ తోడవడంతో వరి, ఉద్యాన పంట సాగు శాపమైంది. వ్యవ సాయానికి చేయూతనివ్వాల్సిన సహకార బ్యాంకులు ఎప్పుడో కాడిపడేశాయి. వాణిజ్య బ్యాంకులు రుణాల మంజూరులో గణాంకాలకే పరిమితం. ధాన్యం సేకరణలోనూ రైతులకు ప్రభుత్వం చుక్కలు చూపించింది. రైతుకు నిండుగా దిగుబడి.. రాబడికి బదులుగా ఈ ఏడాది ఆసాంతం కన్నీటినే మిగిల్చింది. కనీసం పెట్టుబడి వెనక్కిరానంతగా నష్టాలమయం. ఆక్వా రైతులదీ అదే పరిస్థితి.

ఉమ్మడి పశ్చిమలో ప్రత్యేకించి మూడున్నర లక్షల ఎకరాలకుపైగా సాగు చేయడానికి రైతులు సిద్ధపడ్డారు. నీటి విడుదలలో జాప్యం, కాల్వల్లో తూడు, కాడ తొలగించకపోవ డం, ఆధునికీకరణ పనులు మూతపడడం డెల్టాలో కష్టాల రూపంలో రైతులను వెన్నాడాయి. కరెంటు కోతలు, తగినంత నీటి సామర్థ్యం లేక మెట్టలోనూ రైతుకు చింతే మిగిలింది. ప్రభుత్వం నుంచి భరోసా లభించలేదు. సార్వా ఆరంభంలోనే భారీ వర్షాలు కురియడంతో నారుమళ్లు నీట మునిగాయి. మరికొన్ని చోట్ల అప్పుడే వేసిన నాట్లు కనిపించకుండా పోయాయి. మేమున్నామంటూ ప్రభుత్వం ప్రకటనలైతే గుప్పించిందే కాని వ్యవసాయ అధికారులను, సచివాలయ సిబ్బందిని సన్నద్ధం చేయడంలో విఫలమైంది. రైతు సంఘాల నుంచి ఏకబిగిన వ్యతిరేకత వ్యక్తమైన తరుణంలోనూ వైసీపీ సర్కారుది అదే పద్ధతి. ఈ ఏడాది చివరాంతంలో తుఫాన్‌ కారణంగా వేలాది ఎకరాల్లో వరి పంట కాస్తా నీటముని గింది. తడిసిన పంటను ఒడ్డుకు చేర్చేందుకు వీలులేని దుర్భరపరిస్థితి. భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో రైతులు అష్టకష్టాలు పడ్డారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటన లతో రైతుల కన్నీళ్లు తుడుస్తున్నట్టుగా సినిమా చూపించారే కాని తక్షణ సాయం అందించలేకపోయారు. ప్రత్యేక అధికారు లు, మంత్రులు, ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగా చేల చుట్టూ తిరిగారు. వ్యవసాయాధికారులు ఎప్పటి మాదిరిగానే నష్టం అంచనా వేస్తున్నామంటూ దాదాపు నెల రోజుల వరకు చెబుతూనే ఉన్నారు. భరోసా కేంద్రాలు తమదైన పాత్ర పోషించలేకపోయాయి. రైతులు దాదాపు రూ.150 కోట్లకు పైగా వరి పంటను నష్టపోయారని ఓ అంచనా. మరోవైపు తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు రైతులందరికీ యథావిధిగానే చుక్కలు చూపించారు. ప్రతీ క్వింటాకు కిలో చొప్పున నొక్కేశారు. పంట పొలాల నుంచి నీటిని తోడేందుకు వీలుగా రైతులకు డీజిల్‌ ఇంజన్లు సమకూర్చడంలోనూ ప్రభు త్వం తెల్లమొఖం వేసింది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా ల్లో ఈ ఏడాదాంతం వరకు కొనుగోళ్ళల్లో సక్రమ పద్ధతులు పాటించకపోగా వీటిని నిలదీసే ఎమ్మెల్యే, మంత్రిగాని ఎవరూ లేకుండా పోయారు.

ఏదీ.. ఎక్కడ బీమా ?

ఏటా పంటల బీమా కింద రైతుల నుంచి ప్రీమియం అయితే కట్టించుకుంటున్నారు కాని ఆచరణకు వచ్చేసరికి ఈ బీమాను ధీమాగా వదిలేస్తున్నారు. ఈసారీ అదే జరిగింది. ప్రభుత్వపరంగా రైతులను సన్నద్ధపరిచి ముందస్తుగా బీమా కింద పంట చేలను తెచ్చే ప్రక్రియలో ఊగిసలాడారు. ప్రభు త్వపరంగా కట్టాల్సిన ప్రీమియంను గాలికొదిలేశారు. ఈ విషయంలోను నాలుగేళ్లుగా సంబంధిత అధికారులెవరూ రైతులను అప్రమత్తం చేయలేకపోగా ఇంకోవైపు ప్రభుత్వ పరంగా ఆసక్తి సన్నగిల్లడం రైతుకు శాపంగానే మారింది. ఈ ఏడాది తుఫాన్‌ దెబ్బకి, భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు కోల్పోయినా దిక్కుమొక్కులేదు. దీనికితోడు ఇన్‌పుట్‌ సబ్సిడీ గాలిలో దీపంగా మారింది. ఒకనాడు రైతుకు పెట్టు బడి పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ అలవోకగా లభించేది. ఇప్పు డు ఆ పరిస్థితి లేకపోవడం రైతు దిగాలు పడేలా చేసింది.

రైతుకు నష్టం.. దళారీకి లాభం

వైసీపీ సర్కార్‌ ఆది నుంచి ధరల అదుపులో తన పరిధిని కోల్పోయింది. ప్రతీసారి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నప్పుడు పంటలకు నష్టం వాటిల్లి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుండగా దళారులు దర్జాగా బతుకుతున్నారు. ఈ ఏడాది పదేపదే భారీ వర్షాలు, తుఫానులు కారణంగా ఉద్యా నవన పంటలు దెబ్బతిన్నాయి. ఆఖరుకి కూరగాయలు చేతికి రాలేదు. టమోటా ధరలు ఆకాశాన్నంటేలా చేశారు. ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టించాయి. ఆఖరుకి ఉక్రెయిన్‌ యుద్ధం బూచి చూపి నూనె ధరలు చుక్కలనంటాయి. పామా యిల్‌ రకం ఒక్కసారిగా రూ.130లకు చేరగా మిగతా చము రు ధరలన్నీ రూ.190కి పెరిగాయి. పామాయిల్‌ పండించే రైతులకు మాత్రం తగిన మద్దతు ధర లేక ఈ ప్రాంతంలో నష్టపోవాల్సి వచ్చింది. ఉత్తరాదిలో పంట తగ్గిందంటూ పప్పుల ధరలను ఏకబిగిన పెంచుతూ వచ్చారు. ఇంతెందుకు బియ్యం ధరలైతే లెక్కాపక్కా లేకుండా ఒక్కసారిగా పెంచేశా రు. సోనా మసూరి ధర ఈసారి గరిష్ఠంగా కిలో 63 రూపా యలకు పెరిగింది. మిగతా రకాలు 58 రూపాయల వరకు వచ్చి చేరాయి. ఈ పరిస్థితిని అదుపు చేయాల్సిన సర్కార్‌ పట్టనట్టు ప్రవర్తించింది.

ఆక్వా.. ఆగమాగం

గతంలో ఎన్నడూ లేని విధంగా ఆక్వా రంగం విలవిలలా డింది. ఒకనాడు ఆక్వాకు ఆయువు పట్టు అయిన భీమవరం, పరిసర ప్రాంతాలన్నీ అప్పుల ఊబిలో మునిగి ఉన్నాయి. వైసీపీ సర్కార్‌ ఆక్వాను ఆదుకుంటా మని చెప్పి చేపలు, రొయ్యలకు ధర నిర్దేశించింది. దీనికోసం చాన్నాళ్ల వరకు వైసీపీ నేతలంతా గొప్పలు చెప్పారు. తీరా ఆక్వా రైతులంతా ఇప్పటికీ కోలుకోలేదు. ఈ ఏడాది మార్కెట్‌లో ధరలు పతన మవ్వగా ఇంకోవైపు లీజు ధరలన్నీ అమాంతం పెరిగాయి. ఫలితంగా ఆక్వా రైతులంతా ఉక్కిరిబిక్కిర య్యారు. విధాన నిర్ణయాల్లో ప్రభుత్వం తప్పటడుగులు వేయడం, మార్కెట్‌లో స్థిరత్వం లేక ఆక్వా విలవిలలాడింది. వాణిజ్య బ్యాంకుల్లో అప్పులు పెరిగి రైతులకు వడ్డీలు భారంగా మారాయి. వందలాది మంది రైతులు చెరువుల్లోనే రొయ్యలను తెగ నమ్ముకుంటున్నారు. ఈ మధ్యకాలంలో విద్యుత్‌ బిల్లులు ఎకరాకు లక్షల్లో రావడం ఆక్వా రైతుపై మరో పిడుగు. యూరప్‌లో వాణిజ్య నౌకలపై ఉగ్రమూకలు విరుచుకుపడు తుండడం ఆ ప్రభావం కూడా ఆక్వా ఎగుమతులపై పడింది. ఈ ఏడాది ఆక్వా రైతుకు లాభం కంటే నష్టం 200 కోట్లకు పైబడే మిగిలింది. అసలుసిసలు లెక్క తేల్చేసరికి ఇది రెండింతలు కావొచ్చు.

Updated Date - Dec 28 , 2023 | 12:08 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising