దండయాత్ర
ABN, Publish Date - Dec 14 , 2023 | 11:11 PM
నాలుగున్నరేళ్లుగా వైసీపీ సర్కారులో అంతా ఇదే తంతు. ఇష్టమొచ్చినట్టు సర్కారు వేషాలు వేయొచ్చు కాని ఎవరైనా నోరు విప్పి ప్రశ్నిస్తే తట్టుకోలేరు. వెంటనే ఆగ్రహించి తమదారికి వచ్చేలా అక్రమ కేసులు లేదా వేధింపులు. ఇవన్నీ నెలల తరబడి భరించిన వారంతా ఇప్పుడు క్రమేపీ గొంతు విప్పడం ఆరంభించారు.
జగన్ సర్కారుపై నిరసన వెల్లువ
ఎన్నికల వేళ బెదిరింపులకు లొంగని సంఘాలు
ఉద్యోగ, కార్మిక, రైతు సంఘాల ఆందోళనబాట
అన్ని వర్గాల్లోనూ పెల్లుబుకుతున్న అసంతృప్తి
అంగన్‌వాడీలు, ఆర్టీసీ బాటలోనే ఇంకొందరు
నిమ్మకు నీరెత్తినట్టుగా ఎమ్మెల్యేలు, మంత్రులు
టీడీపీ–జనసేన, వామపక్షాల విమర్శనాస్త్రాలు
అయినా నోరు మెదపని జగన్ సర్కారు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
సర్కారును ఎవరైనా ప్రశ్నిస్తే.. పోలీసులు
ఆగ్రహంతో ఊగిపోతారు.
సర్కారును మరెవరైనా నిలదీస్తే..
వైసీపీ కేడర్ పూనకం వచ్చినట్టు ఊగిపోతుంది.
మాట ఇచ్చారు కదా అని నిలదీస్తే.. అధికారులు
దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు శివాలెత్తుతారు.
మా ఓటెందుకు తొలగించారంటే..
సమాధానం దాటేసి గుటకలు మింగుతారు.
కొన్నాళ్ల పాటు ఉద్యోగులపై మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రేమ కురిపించారు. మీ అంతట వారు లేదనట్టుగా ఉద్యోగులను కీర్తించేవారు. గత ప్రభుత్వం కంటే తామే మిన్న అన్నట్టుగా తెగ ఫోజులు కొట్టారు. తీరా సీపీఎస్ వద్దని ఓపీఎస్ ముద్దని ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి ఎప్పుడైతే గళం విప్పారో, రోడ్డుపైకి వచ్చి సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారో ఒక్కసారిగా సీను మారింది. ఉద్యోగు లతో పనిలేదన్నట్టుగా వ్యవహరించడం ఆరంభించారు. ఏటా ఇవ్వాల్సిన బకాయిలను పక్కన పెట్టేశారు. గొంతెత్తితే ఉద్యోగ సంఘాలను దాదాపు అణచివేశారు. ఇప్పటికే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు.
నాలుగున్నరేళ్లుగా వైసీపీ సర్కారులో అంతా ఇదే తంతు. ఇష్టమొచ్చినట్టు సర్కారు వేషాలు వేయొచ్చు కాని ఎవరైనా నోరు విప్పి ప్రశ్నిస్తే తట్టుకోలేరు. వెంటనే ఆగ్రహించి తమదారికి వచ్చేలా అక్రమ కేసులు లేదా వేధింపులు. ఇవన్నీ నెలల తరబడి భరించిన వారంతా ఇప్పుడు క్రమేపీ గొంతు విప్పడం ఆరంభించారు. వైసీపీ సర్కారుపై దండయాత్రకు దిగుతున్నారు. వైసీపీ సర్కా రులో ‘నెల ఫస్ట్‌నే జీతాలు’ అనే నినాదం ఎప్పుడో అదృశ్యమైంది. నెలలో ఏదొక రోజు చేతికొస్తే చాలనే పరిస్థితిలో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నా ప్రస్తుతానికి మౌనంగా భరిస్తున్నారు. కొద్దిమాసాల క్రితం ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధపడ్డారు. ఉపాధ్యాయులు జగన్ సర్కారుపై వీలు చిక్కినప్పుడల్లా కాలు దువ్వుతూనే ఉన్నారు. వీరందరికీ బదిలీల పేరిట కొత్త సీను చూపించారు. అయినా వీటిని మౌనంగా భరించిన ఉపాధ్యాయులను ఇక భవిష్యత్తులో జరిగే ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యులను కానీయబోమనే ధోరణిలో సర్కారు నుంచి సంకేతాలు వచ్చాయి. ‘మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి’ అనే ధోరణికి ఉపాధ్యాయులు వచ్చారే తప్ప జగన్ సర్కారుకు మోకరిల్లలేదు. ఇక ఉద్యోగుల్లో అత్యధికులు సర్కారుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ భయాన్ని పక్కనపెట్టి కయ్యానికి కాలు దువ్వడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే వీఆర్వోలు దగ్గర నుంచి వైద్య ఆరోగ్య శాఖ, వివిధ విభాగాల్లో ఉన్న వారు ఓపిక నశించి అదను కోసం వేచి చూస్తున్నారు.
నాడు ఆశ.. నేడు అంగన్‌వాడీ
కొద్ది రోజుల క్రితం తమకు వేతనాల చెల్లింపులో సర్కారు శ్రద్ధ పెట్టకపోగా అనవసర పనులకు కూడా తమనే ఉపయోగించుకుంటున్నారనే ఆగ్రహంతో ఆశ వర్కర్లు ఆందోళనకు దిగారు. ఇచ్చిన మాట ప్రకారం తమకు వేతనాలు సవరించాల్సిందేనని పట్టుపట్టారు. కలెక్టరేట్ ఎదుట, ఆర్డీవో కార్యాలయం ఎదుట వేలాది మంది వీధులకెక్కి నిరసనలకు దిగారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపు ఎనిమిది వేల మందికిపైగా ఉన్న ఆశ వర్కర్లు గ్రామాల్లో అత్యంత కీలకం. ఈ తరహా ఉద్యోగులను ఎక్కడ సభ జరిగితే అక్కడకు ఉన్నత ఉద్యోగులకు ఆర్డర్ వేసి మరీ వైసీపీ నేతలు రప్పిస్తున్నారు. వేసవిలో సైతం ఆశ వర్కర్లు చెమటోడుస్తారు. కాని వారు తమ డిమాండ్లను నోరు తెరిచి అడిగితే జగన్ సర్కారుకు నచ్చనేలేదు. ఆందోళనను అణచివేతకే ప్రయ త్నించిందే తప్ప వారి డిమాండ్లను తీర్చడానికి ప్రయత్నించ లేదు. దీంతో విసిగి వేసారిన ఆశ వర్కర్లు వైసీపీ సర్కారుపై గుర్రుగానే ఉన్నారు. ఈ పరిస్థితిని ఎమ్మెల్యేలు గమనించినా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి డిమాండ్లలో కొన్నింటినైనా ఆమోదించేలా శ్రద్ధ పెట్టలేదనే ఆగ్రహం ఆశ వర్కర్లలో లేకపో లేదు. మరోవైపు అంగన్‌వాడీలు వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తిప్పలు పడుతూనే ఉన్నారు. తమ డిమాండ్లపై వీలు చిక్కినప్పుడల్లా గళం విప్పతున్నారు. తాను అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణకు మించి వెయ్యి రూపాయలు అదనంగా జీతాలు ఇస్తానన్న హామీ ఏమైందంటూ వేలాది మంది అంగన్‌వాడీలు జగన్ సర్కారుపై ఆగ్రహంతో సమ్మెకు దిగారు. దీనిని వైసీపీ ప్రభుత్వం తప్పు పడుతూ వారిని అణచివేసేందుకు ప్రయత్ని స్తోంది. తమ పార్టీ, ప్రభుత్వానికి అనుకూలంగానే అందరూ వ్యవహరించాలే తప్ప వామపక్షాల అనుబంధ కార్మిక సంఘాలుగా ఉండరాదని మొదటి నుంచి వైసీపీ హుంకరిస్తూనే ఉంది. దాదాపు తొమ్మిది వేల మందికి పైగా అంగన్ వాడీలను ఇప్పుడు నోరెత్తిన పాపానికి వీరిపై సచివాలయ సిబ్బంది, వలంటీర్ల ను మోపారు. అయితే అమీతుమీ తేల్చుకోవడానికే అంగన్ వాడీలంతా సంసిద మై ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు తాము తాళాలు వేస్తే వీటిని పగులకొట్టి సచివా లయ సిబ్బంది స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో అంగన్‌వాడీల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది.
సర్కారుపై పోరుకు మేము సైతం !
జగన్ సర్కార్‌పై ఒక్కొక్కరుగా విరుచుకుపడుతూ వస్తున్నారు. ఈకోవలోనే ప్రజా రవాణా శాఖ ఉద్యో గులు రోడ్డుకెక్కుతు న్నారు. ఆర్టీసీని అట్ట హాసంగా ప్రభుత్వంలో విలీనం చేసిన దగ్గర నుంచి ఉద్యోగుల్లో ఉన్న సంతృప్తి కాస్తా కొవ్వొత్తిలా కరిగి పోయింది. ఆ స్థానంలో తీవ్ర ఆగ్రహం, అసం తృప్తి అలముకుంది. వేతన సవరణ, ఇతర బకాయి లకు సంబంధించి ప్రభుత్వం స్పం దించి చెల్లించాల్సిందేనని సామరస్యంగా ప్రభుత్వం ఎదుట ఉద్యోగులు తమ డిమాం డ్లు ఉంచారు. కాని ఆర్థికంగా ప్రభుత్వ డొల్లతనం తమ బకాయిలు చెల్లించడంలోని వైఫల్యంతోనే బయటపడిందని ఉద్యోగులు ఇప్పుడు బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికితోడు బస్సుల నిర్వ హణ అత్యంత దారుణంగా మారడం, ప్రయాణికుల నుంచి తామే శాప నార్థాలు భరించాల్సి రావడం జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే సమ్మె నోటీ సుకు దిగారు. ఇక సర్కారు దిగిరాకపోతే అమీతుమీ తేల్చుకోవాలని భావిస్తు న్నారు. వీనికితోడు కార్మిక సంఘాల్లో భాగంగా అనేక విభాగాల్లో ఎక్కడికక్కడ సర్కారుపై దండెత్తడానికి వెనుకంజ వేయకుండా దూకుడుగా వెళ్లాలని భావిస్తున్నారు. మునిసిపల్ వర్కర్లు సైతం పలు దఫా లుగా తమ డిమాం డ్లపై ము నిసిపల్ కార్యాలయ గేట్ల వద్దే ఇప్పటి వరకు నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. కొన్నాళ్లపాటు పారి శుధ్య కార్మికులు ఇంతకు ముందు సమ్మెకు దిగారు.
నవ్విపోదురు గాక మాకేంటి..
ఉద్యోగులు దగ్గర నుంచి ఆర్టీసీ కార్మికుల వరకు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతుండగా కనీసం వారి డిమాండ్లపై, వారి కోర్కెలపై సాను కూలంగా స్పందించే మంత్రులు, ఎమ్మెల్యేలు మచ్చుకైనా కనిపించ కుండాపోయారు. వీరంతా తమకు ఓట్లు వేయరని, తమకు ఓట్లు వేసే వారికే తమ మద్దతు ఉంటుందన్న ట్టుగా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల వైఖరి ఉంది. ఒక్క ఉద్యోగులు, కార్మికులే కాదు కౌలు రైతులు తమ కష్టాలను ఏకరువు పెడుతుంటే సంబంధిత మంత్రులెవరూ నోరు మెదపనేలేదు. ఆఖరుకి ఈ మధ్యన పెను తుఫాను వచ్చి పంట నష్టపోయిన రైతులు
ఓవైపు పొలం గట్లమీదే అశువులు బాస్తున్నా.. ఈ సర్కారుకు పట్టనే పట్ట దని తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు విమర్శల దాడి చేస్తున్నా నవ్వి పోదు రుగాక మాకేంటనే రీతిలోనే వైసీపీ సర్కారు ఉంది. ఓటర్ల జాబితాలో ఎందుకీ తప్పుల తడకంటూ నిలదీస్తే.. మాకేంటంటూ నిలువునా వైసీపీ బరితెగిస్తోంది. ఎన్నికలు ముంచు కొస్తున్న వేళ వైసీపీ సర్కారుకు తగినంత షాక్ ఇచ్చేందుకే తామంతా సిద్ధమన్నట్టుగా అనేక సంఘాలు ఇప్పటికే సంకేతాలు ఇస్తున్నాయి.
Updated Date - Dec 14 , 2023 | 11:11 PM