ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆధార్‌ పుట్టిన తేదీ చెల్లదు

ABN, First Publish Date - 2023-11-22T23:17:06+05:30

ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల పరిధిలో కొన్ని పథకాలకు ధ్రువీకరణకు వీలుగా ఆధార్‌లో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటూ వచ్చారు.

ఇటీవల జారీ అయిన ఆధార్‌కార్డు ఒకవైపు బాక్సులో క్లియర్‌గా తాజా నిర్ణయాన్ని ప్రకటించడం గమనించవచ్చు.

ఆధార్‌ జారీ సంస్థ ఆదేశాలపై విస్మయం

ఐదు రోజుల క్రితమే కీలక నిర్ణయం

తక్షణం అమలులోకి వస్తుందంటూ కీలక ప్రకటన

సంక్షేమ పథకాలపైన తీవ్ర ప్రభావం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి )

ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల పరిధిలో కొన్ని పథకాలకు ధ్రువీకరణకు వీలుగా ఆధార్‌లో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటూ వచ్చారు. ప్రత్యేకించి నిరక్షరాస్యుల అత్యధికుల్లో ఈ పద్ధతి ద్వారానే పుట్టిన తేదీని గుర్తించేవారు. ఆధార్‌ సంస్థ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా తాజాగా ఐదు రోజుల క్రితం ఒక కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ నిర్ణయ ప్రభావం వేలాది మందిపై పడనుంది. ఇదికాస్తా పేద వర్గాలకు శరాఘాతమే కాబోతుంది. చాలా కాలం నుంచి మనకు ఏది కావాలన్నా ఆధార్‌ కార్డు ను గుర్తింపుగా పరిగణనలోకి తీసుకుంటు న్నారు. వృద్ధాప్య పింఛన్‌కైనా, వితంతువులకు ఆర్థిక సాయం చేయడానికైనా, చంటి పిల్లలను హాస్పటల్‌ చేర్పించినా ఈ కార్డు ఆధార మైంది. ఆధార్‌తోనే మిగతా కార్డులన్నీ, అకౌంట్‌లన్నీ లింక్‌ అవుతూ వచ్చాయి. ఇలాంటి సమయంలోనే ఆధార్‌లో ‘పుట్టిన తేదీ’ ఇక ముందు చెల్లదంటూ ఆధార్‌ జారీ సంస్థ ఐదు రోజుల క్రితం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చర్య అమలు తక్షణం అమలులోకి వస్తుందని ప్రకటిం చింది. వాస్తవానికి ఆధార్‌లో నమోదైన పుట్టిన తేదీకి సంబం ధించి ఇంతకు ముందే కొంత గందర గోళం ఉంది. అయినా కూడా పుట్టిన తేదీ సక్రమమే అని ఆధార్‌లో గుర్తించడానికి గెజిటెడ్‌ ధ్రువీకరణను ప్రామాణికంగా తీసుకునేవారు. లేకుంటే నోటరీ పద్ధతిలో కొందరు ధ్రువీకరణకు ప్రయత్నించేవారు. కాని ఆకస్మికంగా ఆధార్‌లో నమోదైన పుట్టిన తేదీ ఇక చెల్లదన్నట్టుగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కొందరిలో గుబులు రేపుతోంది. ఇక ముందు ఆధార్‌ అనేది ‘గుర్తింపు రుజువు’ మాత్రమే. ‘పౌరసత్వం, పుట్టిన తేదీకి కానేకాదు’ అంటూ తాజాగా జారీ చేస్తున్న ఆధార్‌ కార్డులపై ముద్రించడం విశేషం. కొన్నేళ్ళ క్రితం వరకు ఆధార్‌లో సన్‌ ఆఫ్‌, డాటర్‌ఆఫ్‌, వైఫ్‌ ఆఫ్‌ అనే బంధుత్వం కూడా ఉండేది. రెండేళ్ల క్రితమే ఈ పదాలన్నిం టినీ తొలగించి అప్పటి నుంచి కేరాఫ్‌ అంటూ ప్రచురిస్తు న్నారు. ఇప్పుడు తిరిగి ఇకముందు ఆధార్‌ కార్డులో నమోదై ఉన్న పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకోబోమని, ఇది ఏమాత్రం చెల్లబోదని ప్రకటించడం ఒకింత విస్మయానికి గురి చేస్తోంది.

సంక్షేమ పథకాలపై క్రీ నీడ

సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వాలు ఆధార్‌కార్డును ప్రామాణికంగా తీసుకుని ఆయా కుటుం బాల అర్హతను గుర్తిస్తూ వచ్చాయి. ఉదాహరణకు కొన్ని ఇలా ఉన్నాయి.. 45 ఏళ్లు దాటితేనే మహిళలకు చేయూత కింద రుణం, 35 ఏళ్లు నిండిన ఒంటరి మహిళలకు ఆర్థిక చేయూత, 60 ఏళ్లు దాటితే వృద్ధాప్య పింఛన్‌, 60 ఏళ్లు దాటిన వారికి బీమా సౌకర్యం కల్పిస్తూ వస్తున్నారు. వీటన్నింటిలో పుట్టిన తేదీని ఆయా వ్యక్తుల ఆధార్‌ కార్డుల్లో నమోదైన తేదీనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. గిరిజన తెగలకు చెందిన వ్యక్తులకు వృద్ధాప్య పింఛన్‌ అందించాలంటే 50 ఏళ్లు నిండితే చాలు ఇక్కడ కూడా ఆధారే ఆధారం. ఇలాంటి కీలక నిర్ణయాలు, పేద వర్గాలకు చెందిన లబ్ధిదారుల ఎంపికలో ఓ గుర్తింపుగా ఉన్న పుట్టిన తేదీకి చెక్‌ పెట్టారు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడమే కాకుండా తక్షణం అమలులో పెట్టారు. ఇప్పుడు తాజాగా నమోదవుతున్న ఆధార్‌ కార్డులన్నింటిలోనూ ఈ విషయం ప్రచురించి జారీ చేస్తున్నారు. ఇంకోవైపు ఏ ఏడాదికాయేడాది సర్కార్‌ ప్రవేశపెట్టిన పథకాల కింద లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ వస్తుండగా ఇప్పుడు పుట్టిన తేదీ కూడా ఓ సమస్యగా మారడంతో ఇక ముందది పేదల మెడకు చుట్టుకోబోతుంది. ఫలితంగా వేలాది మంది సంక్షేమ పథకాలకు పూర్తిగా దూరమవుతారని భావిస్తున్నారు.

Updated Date - 2023-11-22T23:17:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising