ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యువగళం ముగింపు సభను విజయవంతం చేయాలి

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:18 AM

విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు.

పార్వతీపురం(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం బలిజిపేటలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను తీసుకెళ్లేందు కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకుండా ఆటంకాలు సృష్టించడం దారుణమని తెలిపారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా వెనుకాడకుండా భారీగా సభకు తరలిరావాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు పెంకి వేణుగోపాల్‌ నాయుడు, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

పాలకొండ: యువగళం ముగింపు సభ విజయవంతం చేయాలని టీడీపీ పాలకొండ నియోజకవర్గం ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ కోరారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ నియోజవర్గంలోగల ప్రతి పంచాయతీ నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

భామిని: ఈనెల 20వ తేదీన నిర్వహించనున్న యువగళం ముగింపు సభను విజయవంతం చేయాలని టీడీపీ పాలకొండ నియోజకవర్గం ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ, పార్టీ స్టేట్‌ అబ్జర్వర్‌ చెల్లుబోయిన శ్రీనివాస్‌ కోరారు. ఆదివారం భామినిలో మండలానికి చెందిన ముఖ్య నాయకులతో వారు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కె.అప్పలనాయుడు, గొట్టుముక్కల కామేశ్వరరావు, మోడిబోయిన జగదీశ్‌, భూపతి ఆనందరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising