సీపీఎస్ రద్దు ఏది సారూ?
ABN, Publish Date - Dec 31 , 2023 | 12:24 AM
ప్రభుత్వం రాగానే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించిన సీఎం జగన్మోహన్‌రెడ్డి.. ఆ హామీ ఏమైంది సారూ.. అని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ ప్రశ్నించారు.
పాలకొండ: ప్రభుత్వం రాగానే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించిన సీఎం జగన్మోహన్‌రెడ్డి.. ఆ హామీ ఏమైంది సారూ.. అని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ ప్రశ్నించారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాల యంలో ‘మరిచిన 85 శాతం హామీలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ సీఎం జగన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఎక్కడని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ లను తుంగలోకి తొక్కారని విమర్శించారు. అంగన్‌వాడీలు రోడ్డు మీదకు వచ్చి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నా జగన్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు అయినా లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదని, అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలేశార న్నారు. తల్లిని, చెల్లిని నమ్మక ద్రోహం చేసిన జగన్ రాష్ట్ర ప్రజలకు ఏమి ఉద్దరిస్తార న్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంటా సంతోష్, పార్టీ మండల అధ్యక్షుడు గండి రామినాయుడు, పార్టీ నాయకులు వెన్నపు శ్రీను, సుంకరి అనీల్‌దత్, ఆనాపు జవరాజు, జాడ శ్రీథర్, శాసపు సుగుణాకర్, కరణం వరహాలనాయుడు, బల గ వెంకటరమణ, జీలకర్ర మోహన్‌రావు, వెంకటేష్, స్వామినాయుడు పాల్గొన్నారు.
Updated Date - Dec 31 , 2023 | 12:24 AM