ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పార్వతీపురంలో టీడీపీ జెండా ఎగరేస్తాం

ABN, Publish Date - Dec 30 , 2023 | 12:17 AM

పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయచంద్ర అన్నారు.

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయచంద్ర అన్నారు. శుక్ర వారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్వతీపురం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన పలువురు యువకులు టీడీపీలో చేరారు. ఈసందర్భంగా వారందరికీ విజయ చంద్ర పార్టీ కండువా వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ టీడీపీ విజయం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్వతీపురం మం డల అధ్యక్షుడు బోనుదేవి చంద్రమౌళి, పట్టణ ప్రధాన కార్యదర్శి మజ్జి వెంకటేష్‌, కౌన్సిలర్‌ నారాయణరావుతో పాటు పార్టీ నాయకులు కోలా మధుసూదనరావు, పి.సత్యనారాయణ, బార్నాల సీతారాం, బురిడి శ్రీరాములు తదితరులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఓటరు జాబితా పరిశీలన వేగవంతం చేయాలి

పార్టీ ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీతో పాటు ఓటరు జాబితా వెరిఫికేషన్‌ కార్యక్రమం వేగవంతంగా పూర్తి చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయచంద్ర కోరారు. శుక్రవారం పార్వతీపురంలో క్లస్టర్‌ ఇన్‌చార్జి తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు నిర్వహించాల్సిన కార్యక్రమాలు వేగవంతం చేసి, పార్వతీపురం నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో ఉంచాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బార్నాల సీతారాం, బోనుదేవి చంద్రమౌళి, కౌన్సి లర్‌ నారాయణరావు, పి.సత్యనారాయణతో పాటు బలిజిపేట, సీతానగరం, పార్వతీ పురం మండలాలకు చెందిన క్టస్టర్‌ ఇన్‌చార్జిలు, బూత్‌ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:17 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising