ఓటర్ల జాబితా పక్కాగా ఉండాలి
ABN, Publish Date - Dec 22 , 2023 | 12:15 AM
గ్రామాల్లో ఓటర్ల జాబితాలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకో వాలని ఓటర్ల జాబితా పరిశీలన ప్రత్యేక కమిషనర్ జే.శ్యామలరావు సూచించారు.
బొండపల్లి: గ్రామాల్లో ఓటర్ల జాబితాలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకో వాలని ఓటర్ల జాబితా పరిశీలన ప్రత్యేక కమిషనర్ జే.శ్యామలరావు సూచించారు. గొట్లాం గ్రామంలోగల 147, 148, 149 పోలింగ్ కేంద్రాలను ఆయన గురువారం సం దర్శించారు. ఈసందర్భంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఆయా బీఎల్వోలకు పలు సూచనలు చేశారు. ఓటర్ల జాబితాలు పక్కగా ఉండాలని, అర్హత ఉన్న ప్రతిఒ క్కరి ఓటు ఓటరు జాబితాలో ఉండే విధంగా చూడాలన్నారు. పోలింగ్ బూత్‌ల్లో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ డీజీఎంఎస్ ప్రసాదరావు, ఆర్‌ఐ కరుణ కుమార్, వైసీపీ జిల్లా నాయకులు మీసాల తులసీరాం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 22 , 2023 | 12:15 AM