హెడ్‌కానిస్టేబుల్‌పై దౌర్జన్యం.. పోలీసులకు ఫిర్యాదు
ABN, Publish Date - Dec 22 , 2023 | 12:03 AM
విజయనగరం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కేఎన్ మూర్తి తనపై దౌర్జన్యం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ పి.సూర్యకుమారి గురువారం తెలిపారు. యువగళం పాదయాత్ర సభ సందర్భంగా సవరవల్లి నుంచి గంట్లాం వెళ్లే రహదారిలో విధులు నిర్వహిస్తున్న రెండో పట్టణ పోలీస్‌ష్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ కేఎన్ మూర్తిపై బుధవారం రాత్రి నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఘర్షణకు దిగారని, అలాగే దౌర్జన్యం చేశారని తోపులాటలో బంగారు లాకెట్ కూడా కనిపించకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సూర్యకుమారి తెలిపారు.
భోగాపురం: విజయనగరం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కేఎన్ మూర్తి తనపై దౌర్జన్యం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ పి.సూర్యకుమారి గురువారం తెలిపారు. యువగళం పాదయాత్ర సభ సందర్భంగా సవరవల్లి నుంచి గంట్లాం వెళ్లే రహదారిలో విధులు నిర్వహిస్తున్న రెండో పట్టణ పోలీస్‌ష్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ కేఎన్ మూర్తిపై బుధవారం రాత్రి నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఘర్షణకు దిగారని, అలాగే దౌర్జన్యం చేశారని తోపులాటలో బంగారు లాకెట్ కూడా కనిపించకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సూర్యకుమారి తెలిపారు.
Updated Date - Dec 22 , 2023 | 12:03 AM