ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గంజాయి రవాణాపై నిఘా

ABN, Publish Date - Dec 31 , 2023 | 11:05 PM

విశాఖ రేంజ్‌ పరిధిలో గంజాయి రవాణాపై ప్రత్యేకంగా నిఘా పెట్టామని డీఐజీ హరికృష్ణ తెలిపారు. ఆదివారం కొమరాడ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు సంబంధించిన పలు రికార్డులను ఆయన పరిశీలించారు.

కొమరాడ పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు పరిశీలిస్తున్న డీఐజీ హరికృష్ణ

కొమరాడ, డిసెంబరు 31 : విశాఖ రేంజ్‌ పరిధిలో గంజాయి రవాణాపై ప్రత్యేకంగా నిఘా పెట్టామని డీఐజీ హరికృష్ణ తెలిపారు. ఆదివారం కొమరాడ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు సంబంధించిన పలు రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. గంజాయి రవాణా అదుపులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం పట్టుబడుతున్న గంజాయి ఒడిశా నుంచి వచ్చిందేనని తెలిపారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, సెల్‌ టవర్ల నిర్మాణం వంటివి జరుగుతున్నాయన్నారు. విశాఖ రేంజ్‌ పరిధిలో నక్సల్స్‌ కార్యక్రమాలు లేవని చెప్పారు. ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో నిరంతరం కూంబింగ్‌ జరుగుతుందని వెల్లడించారు. గతంతో పోలిస్తే నేరాలు, ప్రమాదాలు తక్కువగా నమోదైనట్లు తెలిపారు. ఆయన వెంట ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, డీఎస్పీ మురళీధరన్‌, పార్వతీపురం సీఐ స్వామినాయుడు, తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 11:05 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising