నీట మునిగిన పంట
ABN, First Publish Date - 2023-12-05T23:41:34+05:30
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో చేతికి అందివచ్చిన పంట నీటి పాలయిపోతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
గజపతినగరం: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో చేతికి అందివచ్చిన పంట నీటి పాలయిపోతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో మం డలంలోని 3,600 హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా మండలంలోని 410 ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు గుర్తించారు. అయితే ప్రస్తుతం తుఫాన్ నేపథ్యంలో ఉన్న పంటను కాపాడుకోడానికి రైతన్నలు వ్యయ ప్రయా సలు పడుతున్నారు. పొలాల్లోకి నీరు చేరడంతో ధాన్యం రంగు మారే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. అలాగే గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు అధ్వానంగా మారడంతో పలు గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. పురిటిపెంట జగనన్న కోలనీలకి వెళ్లే రహదారి బురదమయమైపోవడంతో కాలనీవాసులు గగ్గోలు పెడుతున్నారు.
శృంగవరపుకోట రూరల్ /జామి: తుఫాన్ నేపథ్యంలో కురుస్తున్న వర్షాలను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం మంగళవారం మధ్యాహ్నం వరకు పెద్దగా కనిపించలేదు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి వర్షం తీవ్రత పెరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వర్షం పెద్దది కావ డంతో పాటు పొలాల్లో నీరు చేరడం, కుప్పల కిందకు నీరుచేరడం చూసి భయపడుతున్నారు. ఈ వర్షం రాత్రంతా కురిస్తే తమకు నష్టం తప్పదని వాపోతున్నారు.
రాజాం: అన్నదాతకు మిచౌంగ్ తుఫాన్ గుబులు పుట్టిస్తోంది. మండలంలో 7.5 మిల్లీ మీటర్లు వర్షం కురిపింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి వందలాది ఎకరాలు వరి పంట నీటమునిగింది. రాజాం మండలంలోని ఒమ్మి, గెడ్డవలస, కంచరాం, కొత్తపేట, నర్శింహపురం, వేగిరెడ్డిపేట, బొమ్మినాయుడవలస, ఎమ్ జోగివలస, గడ్డిముడిదాం, గారాజు చీపురుపల్లి, పొగిరి, గురవాం తదితర గ్రామాల్లో వరి పంటలు తడిసి ముద్దవుతున్నాయి. తడిసిన పంటలను కొందరు రైతులు బడిపెలు వేసి కాపాడుతున్నారు.
ఎల్.కోటలో కుండపోత
లక్కవరపుకోట: మండలంలోని మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో కుండపోత వర్షాలు పడ్డాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోసిన పంటలు, వేసిన కుప్పలు, కోయాల్సిన పంట మొత్తం నీటముని గాయి. సోమవారం రాత్రి నుంచి క్రమేనా వర్షపుజోరు ఊపందుకుంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రానికి 92.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వ్యవసాయ గణాంకాల శాఖాధికారి కృష్ణ తెలి పారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలను చూడడానికి ఏ ఒక్క వ్యవసాయాధికారి రాలేదని రైతులు వాపోయారు. అదే విధంగా ఉద్యాన వన పంటలైన మిరప, వంగ, బెండ, బీర, బంతి పంటలకు అపార నష్టం వాటిల్లింది. మల్లివీడు, జమ్మాదేవిపేట, పోతంపేట, చందులూరు, కల్లేపల్లి, రేగ, తామరాపల్లి, గంగుబూడి, ఖాసాపేట గ్రామాల్లో వరి పం టకు అపార నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ఏవో స్వాతిని పంట నష్టంపై వివరాలు కోరగా క్షేత్రస్థాయి పరిశీలన ఇంకా జరగాల్సి ఉందని, ఇప్పటి వరకు 35 ఎకరాలు దెబ్బతిన్నట్టు తెలిపారు. బుధవారం ఉదయం వర కూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హె చ్చరించడంతో మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. చేతికొచ్చిన పం ట వర్షార్పనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-12-05T23:41:35+05:30 IST