ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జనవరి 23న సిరిమానోత్సవం

ABN, First Publish Date - 2023-11-19T23:34:33+05:30

ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవం, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ అమ్మవారి జాతర తేదీలు ఖరారయ్యాయి. ఆదివారం చదురుగుడి ఆవరణలో ఈవో వీవీ సూర్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జాతర తేదీలను ప్రకటించారు.

మక్కువ: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవం, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ అమ్మవారి జాతర తేదీలు ఖరారయ్యాయి. ఆదివారం చదురుగుడి ఆవరణలో ఈవో వీవీ సూర్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జాతర తేదీలను ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 22న తొలేళ్లు, 23న సిరిమానోత్సవం, 24న అనుపోత్సవం, 30న మారుజాతర నిర్వహించడానికి పెద్దలు నిర్ణయించారు. డిసెంబరు 18న పెదపోలమాంబ అమ్మవారి సనప సాటింపుతో జాతరలో ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుంది. పోలమాంబ జాతర రాష్ట్ర పండగ్గా గుర్తించడంతో ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించాలని కమిటీ సభ్యులు తీర్మానించారు. కాగా ఈ జాతర పది వారాల పాటు జాతర జరగనుంది. ఈ సమావేశంలో ట్రస్టు బోర్డు చైర్మన్‌ పూడి దాలినాయుడు, ఎంపీటీసీ పోలినాయుడు, కమిటీ సభ్యులు, దేవదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-11-19T23:34:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising