ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుంతల రోడ్లపై ప్రజాగ్రహం

ABN, First Publish Date - 2023-11-23T23:59:33+05:30

జిల్లాలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఏ రహదారి చూసినా అడుగుకో గొయ్యి దర్శనమిస్తోంది. దీంతో ప్రయాణికులు, వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం రహదారులను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాచిపెంట దళితకాలనీ వద్ద మెయిన్‌ రోడ్డుపై గుంతలు

- వైసీపీ పాలకులను నిలదీస్తున్న జనం

- పొరుగు జిల్లా రాజాం ఎమ్మెల్యేకి చుక్కెదురు

- జిల్లాలో అధ్వానంగా మారిన రహదారులు

- ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా?

- నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యం

(పార్వతీపురం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఏ రహదారి చూసినా అడుగుకో గొయ్యి దర్శనమిస్తోంది. దీంతో ప్రయాణికులు, వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం రహదారులను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో.. ఎమ్మెల్యే కంబాల జోగులపై బుధవారం రాత్రి ప్రజలు విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేగా మీరు అనర్హులంటూ.. పరుష పదజాలంతో మాట్లాడారు. దాదాపు తరిమినంత పని చేశారు. ఇదే పరిస్థితి జిల్లాలో కూడా ఉంది. రోడ్లపై ఉన్న గుంతలు ప్రజాప్రతినిధులకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించు కోరా అని గ్రామాల్లోకి వస్తున్న వైసీపీ నాయకులను నిలదీస్తున్నారు. ఇంకెప్పుడు రోడ్లను బాగు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు. తూతూ మంత్రంగా మరమ్మతులు చేపట్టి వదిలేయవద్దని, శాశ్వతంగా అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. .

అధ్వాన రహదారులతో అవస్థలు

పార్వతీపురంటౌన్‌, నవంబరు 23: అధ్వాన రహదారులతో జిల్లా కేంద్రంలోని ప్రజలు, వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగున్నరేళ్ల నుంచి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారితో పాటు పాతబస్టాండ్‌, బైపాస్‌ రోడ్లపై గుంతలు ఏర్పడడంతో పాదచారులు, ద్విచక్ర, భారీ వాహన చోదకులు ప్రమాదాల బారినపడుతున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన ప్రతిసారీ స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్‌అండ్‌బీ అధికారులు తూతూ మంత్రంగా రోడ్లపై గుంతలు పూడ్చి మమా అనిపించేస్తున్నారు. పాతబస్టాండ్‌ కూడలి నుంచి దీప్తి లాడ్జింగ్‌కు వెళ్లే రహదారి మరీ దారుణంగా ఉంది. భారీ వాహనాలు వెళ్లే సమయంలో చుట్టు పక్కల ఉండే చిరువ్యాపారులతో పాటు పాదచారులు భీతిల్లుతున్నారు. రాయగడ రోడ్డు ప్రారంభం నుంచి డంపింగ్‌ యార్డు వరకు ఉన్న రాష్ట్రీయ రహదారి మధ్యలో ఉన్న గుంతల్లో మట్టిని పోసి వదిలేయడంతో దుమ్ము, ఽధూళీ పైకి వచ్చి చుట్టు పక్కల నివాసితులు, వ్యాపారులు నరకం చూస్తున్నారు. కొత్తవలస ఆంజనేయ స్వామి ఆలయం నుంచి నవిరి కాలనీ సమీపంలోని వై జంక్షన్‌ వరకు రాష్ట్రీయ రహదారిపై తారు ఊడిపోవడంతో వాహనచోదకులు భయ భ్రాంతులకు గురవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం రహదారు లను పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. గత నాలుగున్నరేళ్లుగా జిల్లా కేంద్రం గుండా వెళ్లే రాష్ట్రీయ రహదారిపై గుంతలు ఏర్పడితే మరమ్మతులతోనే సరిపెట్టే యడంపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా రహదారులను పూర్తిగా బాగు చేయాలని కోరుతున్నారు.

రోజుకో ప్రమాదం

కురుపాం: నియోజకవర్గ కేంద్రమైన కురుపాంలో మెయిన్‌ రోడ్‌ గోతులమయమై రోజుకో ప్రమాదం జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విస్తరణ పనులు మధ్యలో ఆగిపోవడంతో సుమారు కిలో మీటరు పొడవున్న మెయిన్‌ రోడ్‌ మురికి కూపంలా మారింది. స్థానిక ధూళికేశ్వర కోవెల వద్ద ఇప్పటికే పది బైక్‌ యాక్సిడెంట్స్‌ జరిగి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల కురుపాం మండల విద్యాశాఖాధికారి కూడా ఇదే స్థలంలో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయడ్డారు. రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ఏడాది క్రితం తోటపల్లి నుంచి కురుపాం వరకు 14 కిలో మీటర్ల రహదారి విస్తరణ పనులకు గాను రూ.33 కోట్లు మంజూరయ్యాయి. సంబంధిత కాంట్రాక్టరుకు ప్రభుత్వం నుంచి సుమారు రూ.14 కోట్ల బిల్లులు రాకపోవడంతో పనులను సగంలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో కురుపాం మెయిన్‌ రోడ్డు ఒక కిలో మీటర్‌, సీమనాయుడు వలస, మేరంగి సెంటర్ల వద్ద పనులు నిలిచిపోయాయి. దీంతో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లోని వివిధ గ్రామాలకు వెళ్లే వాహనచోదకు లు ఇబ్బందులు గురవుతున్నారు. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ జేఈ నిర్మలాకుమారి వివరణ కోరగా సంబంధిత కాంట్రాక్టర్‌కు రూ.14 కోట్ల బకాయిలున్న కారణంగా అతను పనులను మధ్యలో విడిచి పెట్టారని చెప్పారు.

నిధులు ఏమయ్యాయి?

సాలూరు: పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు పలు వీధుల్లో ఉన్న రోడ్లు పూర్తిగా పాడైపోయాయి. కొద్దిపాటి వర్షం వస్తే ఎక్కడ ఏ గుంత ఉందో ఏ ప్రమాదం జరుగుతుందోనని నిత్యం వాహనచోదకులు, ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మునిసిపాలిటీ పరిధిలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం గతంలో మునిసిపల్‌ సర్వసభ్య సమావేశంలో సాధారణ నిధులు నుంచి రూ.రూ.10 లక్షలు కేటాయించారు. అయితే ఆ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో అనేక చోట్ల రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారులను బాగు చేయాలని, కొత్తగా బీటీ రోడ్లు వేయాలని ప్రజలు కోరుతున్నారు.

బీటీ రోడ్డు కోసం ప్రతిపాదనలు పంపాం

సాలూరు పట్టణంలో శివాజీ బొమ్మ జంక్షన్‌ నుంచి గాంధీనగర్‌ వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం సుమారు రూ.25 లక్షలతో ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపిం చాం. నిధులు మంజూరు కాగానే రోడ్డు పనులు ప్రారంభి స్తాం. గుంతలను కూడా పూర్తి స్థాయిలో పూడుస్తాం.

-సూరినాయుడు, మునిసిపల్‌ ఏఈ, సాలూరు

నిత్యం ఇక్కట్లు

గరుగుబిల్లి: మండలంలోని అనేక గ్రామాల రహ దారులు గుంతలమయం కావడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ప్రధానంగా పార్వతీపురం నుంచి పాలకొండ వైపు వెళ్లే ప్రధాన మార్గంలో అడ్డాపుశీల నుంచి రావివలస వరకు ప్రమాదభరితంగా గోతులతో నిండుకుంది. ఏ వైపు చూసినా గోతులే దర్శనం ఇవ్వడంతో ప్రజలు భయాందోళనకు గురవుతు న్నారు. అలాగే రావివలసకు వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. బీవీ పురం నుంచి పెద్దూరు మీదుగా మండల కేంద్రానికి చేరుకోవాలంటే నరకయాతనే. పెద్దూరు సమీపంలో రహదారిపై గొయ్యి ఏర్పడడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి సమీపంలో పారాది వంతెన బలహీనంగా ఉండడంతో భారీ వాహనాలు ఈ మార్గం గుండా అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. భారీ వాహనాల కారణంగా ఇప్పటికే ముగ్గురు మృత్యువాత పడ్డారు. అలాగే మరికొందరు గాయాలపాలయ్యారు. భారీ వాహనాల రాకపోకలతో రహదారులు మరమ్మతులకు గురవుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అడుగుకో గొయ్యి..

పాచిపెంట: పాచిపెంట బైపాస్‌ రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. దళితకాలనీ నుంచి పాతబస్టాండ్‌ వరకు రెండు కిలో మీటర్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. అడుగుకో గొయ్యి ఉండడంతో పాదచారులతో పాటు ద్విచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే బైపాస్‌ రోడ్డు నరకాన్ని తలపిస్తుందని ప్రజలు వాపోతున్నారు.

Updated Date - 2023-11-23T23:59:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising